చైతూ, సమంత రిసెప్షన్‌కు బాలయ్య డుమ్మా.. కారణం అదేనా?

నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. నవంబర్ 12న జరిగిన నాగ చైతన్య, సమంత పెళ్లి రిసెప్షన్‌కు తెలుగు, తమిళ సినిమా ప్రముఖులందరూ తరలివచ్చారు.

By Rajababu

Recommended Video

రిసెప్షన్‌కు బాలయ్య డుమ్మా.. కారణం అదేనా?

నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. నవంబర్ 12న జరిగిన నాగ చైతన్య, సమంత పెళ్లి రిసెప్షన్‌కు తెలుగు, తమిళ సినిమా ప్రముఖులందరూ తరలివచ్చారు. అయితే నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం ఈ వేడుకలో కనిపించకపోవడంతో మళ్లీ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం మరోసారి మీడియాలో నానుతున్నది.

 అక్కినేని, నందమూరి ఫ్యామిలీ..

అక్కినేని, నందమూరి ఫ్యామిలీ..

టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కుటుంబ పరంగానూ, ఫ్యాన్స్ పరంగానూ ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకొన్నారు.

 నాగార్జున, బాలకృష్ణ కూడా

నాగార్జున, బాలకృష్ణ కూడా

అదే సంప్రదాయాన్ని నాగార్జున, బాలకృష్ణ కొనసాగించారు. చాలా కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. పలు వేదికలపై కలిసి కనిపించారు. అయితే కొన్ని రోజులుగా నాగ్, బాలయ్య ఒకే వేదికపైన కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.

 విభేదాలకు కారణం ఇది..

విభేదాలకు కారణం ఇది..

కొన్నేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో చోటుచేసుకొన్న పొరపాటో లేదా తప్పిదం బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు నెలకొనడానికి కారణం అని చెప్పుకొంటారు. ఆ కార్యక్రమంలో తన పేరు గానీ, ఫొటోగానీ ఏర్పాటు చేయకపోవడంతో బాలయ్య నొచ్చుకొన్నారట. దాంతో వారిమధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పకొంటారు.

అప్పుడు కూడా బాలయ్య..

అప్పుడు కూడా బాలయ్య..

అలా మొదలైన వారి విభేధాలు తారాస్థాయికి వెళ్లినట్టు చెప్పుకొంటారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు కూడా బాలయ్య రాకపోవడంపై చర్చ జరిగింది. అయితే ఏదో కారణం చెప్పి దానిని సద్దుమణిగేలా చేశాయి.

 వేడుకలో హరికృష్ణ హాజరు

వేడుకలో హరికృష్ణ హాజరు

తాజాగా చైతూ, సామ్ రిసెప్షన్‌లో హరికృష్ణ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ తదితరులు హాజరయ్యారు. బాలయ్య కూడా వస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన రాకపోవడం వల్ల మళ్లీ విభేదాల విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 పవన్, ఎన్టీఆర్ డుమ్మా..

పవన్, ఎన్టీఆర్ డుమ్మా..

చైతూ, సమంత రిసెప్షన్‌కు పవన్, కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు ఇంకా చాలా మంది రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాలయ్య హాజరుకాకపోవడమే హైలెట్‌గా మారింది. వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటం వల్ల బాలకృష్ణ సన్నిహితులు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X