వెంకటేష్ బ్యూటీతో నాగార్జున రొమాన్స్.. ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్?

Nagarjuna 100th film: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీని 'కింగ్ 100' అనే వర్కింగ్ తో తెరకెక్కుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ పాత్రపై ఓ రూమర్స్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఇది ఆయన కెరీర్‌లో 100వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. కొత్త దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటగా సీనియర్ హీరోయిన్ టబు (Tabu)పేరు వినిపించినా, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా మరో హీరోయిన్ పేరు బలంగా వినిపిస్తోంది.

Nagarjuna 100th Movie with Aishwarya Rajesh Sparks Buzz After Coolie Success

ఆ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). ఇటీవల వెంకటేష్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు నాగార్జునకు జోడీగా నటించబోతుందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతున్నాయి. తెలుగు అమ్మాయే అయినప్పటికీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో ఫోకస్ పెడుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ 100వ సినిమాలో ఛాన్స్ రావడం ఆమెకు పెద్ద బ్రేక్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... నాగార్జున-ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ పూర్తిగా ఫ్రెష్. ఒకవైపు అనుభవం గల స్టార్ హీరో, మరోవైపు నేచురల్ యాక్టింగ్‌తో గుర్తింపు పొందిన హీరోయిన్. ఈ జంట స్క్రీన్‌పై కొత్త ఫీలింగ్ తీసుకురావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకునేలా రొమాంటిక్ ట్రాక్‌ను బలంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఇక కథ విషయానికి వస్తే, ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. నాగార్జున స్టైల్‌కు తగ్గట్టుగా రొమాన్స్, ఎమోషన్, యాక్షన్ అన్ని ప్యాకేజ్‌గా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. 100వ సినిమా కావడంతో, స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మేకర్స్.

మరోవైపు, ఐశ్వర్య రాజేష్ కెరీర్‌కు ఇది కీలకమైన ప్రాజెక్ట్ కావచ్చు. ఇటీవల పెద్దగా సాలిడ్ హిట్ లేకపోవడంతో, ఆమెకు ఈ సినిమా "గోల్డెన్ ఛాన్స్"గా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే, ఆమె మళ్లీ టాలీవుడ్‌లో టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి, నాగార్జున 100వ సినిమా చుట్టూ ఏర్పడుతున్న హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. టైటిల్ నుంచి కాస్టింగ్ వరకు ప్రతి అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నాగ్‌తో జోడీ కడితే, అది ఫ్యాన్స్‌కు నిజంగానే ఒక స్పెషల్ ట్రీట్ అవుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా ఫిక్స్ అవుతుందా? నాగార్జున 100వ సినిమా మరో బ్లాక్‌బస్టర్ అవుతుందా? అనే చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X