Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున..ఏసు ప్రభువు గా కరుణిస్తాడా?
"నేను చివర మూడు రీళ్ళలో నాగార్జునలో జీసస్ ని చూసాను..నేను నాగార్జునని రిక్వస్ట్ చేస్తున్నారు..రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మీరు జీసస్ రోల్ చేయాలి"...అంటూ 'శ్రీరామదాసు' చిత్రం సక్సెస్ మీట్ లో మురళీమోహన్ చెప్పిన మాటలు నిజం అయ్యేటట్లు కనపడుతున్నాయి. అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాలతో భక్తి చిత్రాలను సైతం పండించగలనని నిరూపించుకున్న నాగార్జున త్వరలో ఏసుప్రభువుగా కనిపించి వెండితెరను కరుణించనున్నాడని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం గత సంవత్సరం క్రిస్మస్ రోజున ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనివార్యకారణాల వల్ల దానిని వాయిదా వేసారు. అయితే ఇప్పుడు పూర్తి స్ధాయిలో జీసస్ స్క్రిప్టు, మిగతా విషయాలు కన్ఫర్మేషన్ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది.
ఈ క్రిస్మస్ కి భారీ ఎత్తున ఓపినింగ్ తో ఈ జీసస్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నారు. ఈ చిత్రంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ పాగా వేసే అవకాశం కోసం,కొత్త బిజినెస్ ద్వారాలు ఓపెన్ చేయటానికి ఉపయోగించనున్నారు. ఇక శ్రీరామదాసులో ఫ్యాశన్ ఆఫ్ క్రైస్ట్ లోని కొన్ని సన్నివేశాలను అనుకరిస్తూ అల్లిన సీన్స్ ను బాగా పండించటంతో నాగార్జున ఈ తరహా పాత్రలోనూ పండిస్తాడంటున్నారు. ఇక దర్శకుడు, నిర్మాత, మిగతా తారాగణం వివరాలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే తనని ఎంతవరకూ జీసస్ గా ఆదరిస్తారనే ఆలోచనలో నాగార్జున ఉన్నాడని అంటున్నారు. దాంతో ఈ న్యూస్ ని బయిటకు రాకుండా చూస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇంతకుముందు కరుణామయుడుగా విజయచందర్ అద్బుతంగా నటించి తానేమిటో నిరూపించుకున్నారు. జీసస్ అంటే ఆయనే గుర్తుకు వస్తారు..మరి దాన్ని అధిగమిస్తేనే సినిమా పండుతుందనేది నిజం.