ప్రభాస్ టీమ్‌లో నాగార్జున మనుషులు.. ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న ‘రహస్య వార్త’

Recommended Video

Does Nagarjuna Know About Saaho Postponement In Advance? || Filmibeat Telugu

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' టీమ్‌లో అక్కినేని నాగార్జున మనుషులు ఉన్నారా..? ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడుతుందని వాళ్లు చెప్పబట్టే తన కొత్త చిత్రం రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేశాడా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ వార్త బయటకు రావడంతో 'సాహో' యూనిట్ షాక్‌కు గురైందని కూడా టాక్ వినిపిస్తోంది.

‘సాహో' వాయిదా

‘సాహో' వాయిదా

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో'. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవకపోవడం వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ మధ్య ‘సాహో' కొత్త రిలీజ్‌ డేట్‌ను ఆగస్టు 30కి వాయిదా వేశారు.

నాగ్‌కు ముందే తెలుసా?

నాగ్‌కు ముందే తెలుసా?

‘సాహో' వాయిదా పడుతున్న విషయం నాగార్జునకు ముందే తెలుసంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ‘మన్మథుడు 2' విడుదల తేదీని ఆగస్టు 9న ఫిక్స్ చేయడమే. నాగ్ ఈ ప్రకటన చేసే నాటికి ‘సాహో' వాయిదా పడుతున్నట్లు తెలీకపోవడం విశేషం. అప్పుడు నాగ్ ఏ ధైర్యంతో పెద్ద సినిమా ముందు విడుదల చేస్తున్నారన్న చర్చ కూడా నడిచింది.

వాళ్లే కారణమంటూ ప్రచారం

వాళ్లే కారణమంటూ ప్రచారం

తన కొత్త సినిమాకు డేట్ ప్రకటించినప్పటి నుంచి ‘సాహో' వాయిదా పడే విషయం నాగార్జునకు తెలుసా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాహో' టీమ్‌లో నాగార్జున మనుషులు ఉన్నారంటూ ఓ వార్త బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది.

‘మన్మథుడు 2' గురించి..

‘మన్మథుడు 2' గురించి..

అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2'. కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘మన్మథుడు'కు ఈ సినిమా కొనసాగింపుగా వస్తోంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X