సూపర్ స్టార్‌కు షాకిచ్చిన నాగార్జున.. పాన్ ఇండియా ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశాడా!
కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా మారి.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఏకైక హీరో రజినీకాంత్. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో దూసుకుపోతోన్న ఆయన.. ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ సీనియర్ హీరోకు హిట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే రజినీకాంత్ 'జైలర్' మూవీతో వచ్చారు. ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సూపర్ స్టార్ మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తన 171వ సినిమాను కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. 'కూలీ' (Coolie) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై హైప్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో చిత్ర యూనిట్ మరింత ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందించాలని భావిస్తోంది.

యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న 'కూలీ' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. దీంతో ఈ చిత్రంలో చాలా భాషలకు చెందిన స్టార్లను నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో విలన్ పాత్రను ఓ స్టార్ హీరోతో చేయించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ రోల్ కోసం టాలీవుడ్‌కు చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునను ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ సినిమా టాలీవుడ్‌లోనూ సంచలనం అయిపోయింది.
'కూలీ' సినిమాలో నాగార్జున నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలోనే తాజాగా దీనిపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. రజినీకాంత్ సినిమాలో నటించేందుకు నాగార్జున ఆసక్తి చూపించలేదట. ఇప్పటికీ హీరోగా సత్తా చాటుతోన్న తాను.. నెగెటివ్ రోల్ చేయడం మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కారణంగానే నాగార్జున.. రజినీకాంత్ సినిమాను రిజెక్ట్ చేశారని ఓ టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడీ న్యూస్ తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. రజినీకాంత్‌తో తెరకెక్కించే 'కూలీ' చిత్రాన్ని సైతం లోకేష్ కనగరాజ్ తన గత చిత్రాల మాదిరిగానే యాక్షన్ జోనర్‌లో రూపొందించబోతున్నట్లు తెలిసింది. దీన్ని తన యూనివర్శ్‌కు జత చేసే విధంగా తీస్తున్నాడట. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రజినీకాంత్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











