#AK61 భారీ బడ్జెట్‌‌తో అజిత్‌, నాగార్జున క్రేజీ కాంబో.. హీరోయిన్, నిర్మాత ఎవరంటే?

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే బాలీవుడ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నాగార్జున మరో దక్షిణాది చిత్రంలో నటించడానికి సిద్దంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రేజీ కాంబో ప్రాజెక్ట్‌ గురించి దక్షిణాది సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమవుతున్నది. ఈ ప్రాజెక్ట్‌ గురించిన వివరాలు, నాగార్జున కెరీర్ గురించిన వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోను..

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోను..

తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లతోపాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను మరో లెవెల్‌కు నాగార్జున తీసుకెళ్తున్నారు. బ్రహ్మస్త్ర చిత్రంలో రణ్‌బీర్, అలియాభట్‌తో కలిసి నటిస్తున్నారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ సెన్సేషనల్ సినిమాను తెలుగులో రాజమౌళి డిస్ట్రిబ్యూట్ చేయడం మరింత క్రేజీగా మారింది.

బంగార్రాజుతో భారీ సక్సెస్

బంగార్రాజుతో భారీ సక్సెస్

ఇక తెలుగులో ఇటీవల బంగార్రాజు సినిమాతో నాగార్జున అక్కినేని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నారు. ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది. గత 18 రోజుల్లో 38 కోట్ల షేర్, 64 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడమే కాకుండా నాగార్జున బాక్సాఫీస్‌ స్టామినాను ఈ చిత్రం నిరూపించింది.

అజిత్ 61వ చిత్రంలో

అజిత్ 61వ చిత్రంలో

కెరీర్ పరంగా స్ట్రాంగ్‌గా దూసుకెళ్తున్న నాగార్జున మరో భారీ బడ్జెట్ చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది. అజిత్ కుమార్ కెరీర్‌లో 61వ చిత్రంగా తెరకెక్కే చిత్రంలో నాగ్‌ను, మోహన్‌లాల్‌ను పోలీస్ కమిషనర్ పాత్రలో నటించాలని నిర్మాత బోని కపూర్ కోరారని, అయితే నాగార్జున ఒకే చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని మార్చి నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం.

అదితి రావు హీరోయిన్‌గా, వినోద్ డైరెక్షన్‌లో

అదితి రావు హీరోయిన్‌గా, వినోద్ డైరెక్షన్‌లో

ఇదిలా ఉండగా, అజిత్‌ స్టామినాకు తగినట్టుగా కథను దర్శకుడు హెచ్‌ వినోద్ సిద్దం చేశారు. ఈ చిత్రంలో అజిత్ పాత్ర నెగిటివ్ లుక్‌తో ఉంటుంది. ఈ సినిమాలో అదితి రావు హైదరీ హీరోయిన్‌గా నటించనున్నారు. ఆద్యంతం పవర్ ప్యాక్‌గా ఉండే ఈ సినిమాను సంక్రాంతి 2023లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మిస్తున్నారు అని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ది ఘోస్ట్ షూటింగులో బిజీగా నాగార్జున

ది ఘోస్ట్ షూటింగులో బిజీగా నాగార్జున


ఇక నాగార్జున కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ది ఘోస్ట్ చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్నది. ఈ సినిమా తర్వాత అజిత్ 61 ప్రాజెక్టులో భాగం అవుతారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X