లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో నాగార్జున.. మల్టీస్టారర్ మూవీలో శృతిహాసన్.. ఇంకా ఎవరంటే?

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో పడినట్టు కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ బరిలో దూకిన భారీ హిట్ సొంతం చేసుకొన్న ఆయన ఇక మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఇప్పటికే ఓ టాప్ హీరోతో కలిసి నటిస్తున్న ఆయన మరో స్టార్ హీరో సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. అయితే ఆ సినిమాకూ సెన్సేషనల్ దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్న ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగ సమయంలో నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా తన కెరీర్‌లో హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మంచి కథ ఉంటే.. మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడానికి రెడీ అంటూ ప్రకటించారు.

Nagarjuna Akkineni to play Key role in Lokesh Kanagaraj s Rajinikanth s Thalaivar171

ఇక తన మాట ప్రకారమే ఏషియన్ ఫిల్మ్ బ్యానర్‌పై శేఖర్ కమ్ములు రూపొందించే సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో నాగ్ కనిపించనున్నారు. గతంలో కూడా పలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

తాజాగా తమిళ సినీ పరిశ్రమలో సంచలన రీతిలో ప్రచారం అవుతున్న వార్త ప్రకారం.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో టాలీవుడ్ మన్మథుడు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో 171వ సినిమా కావడం మరింత సంచలనంగా మారింది.

అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ ఇంతకు ముందు ప్రేక్షకులు చూడని పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు కూతురిగా శృతిహాసన్ నటించనున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఏమిటనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. యూనిట్ మాత్రం నాగ్ పాత్ర గురించి చాలా సీక్రెట్‌ను మెయింటెన్ చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X