‘దడ’ డైరక్టర్ పై నాగార్జున ఫైరింగ్
ఎప్పుడూ కూల్ గా ఉండే నాగార్జున రీసెంట్ గా 'దడ" దర్శకుడుపై మండి పడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కారణం సినిమా అవుట్ పుట్ గురించి కాదట. సినిమాకి అస్సలు క్రేజ్ తేలేక పోవటమేనని చెప్తున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ చూసుకుంటూ పబ్లిసిటీ ప్లాన్ చేస్తే సినిమాకు ఈ పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చేదని, తన రాజన్న సినిమాకు వచ్చిన క్రేజ్ కూడా దడ తెచ్చుకోలేకపోయిందని నాగార్జున బాధపడుతున్నారట. ఈ విషయమై దర్శకుడుని ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచిస్తే మంచిదని సూచించాడని తెలుస్తోంది.అందులోనూ సినిమా టైటిల్ లేట్ గా ఎనౌన్స్ చేయటం కూడా దర్శకుడు భాద్యతలేని తనాన్నే సూచిస్తోందని ఫైర్ అయ్యారట. మరో ప్రక్క పాటలు కూడా అనుకున్నంత కిక్ ఇవ్వకపోవటం కూడా నాగార్జునని నిరాశకు గురిచేసిందని తెలుస్తోంది.
తన కుమారుడుని యాక్షన్ హీరోగా నిలబెట్టాలన్న ఆశతో చేస్తున్న ఈ చిత్రంపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకే హౌస్ ఫుల్ వంటి చిత్రం చేసిన దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి సినిమా ప్రారంభించమని పురమాయించాడు. ఇక దడ చిత్రం పై అభిమానులు ఆశలు పెట్టుకున్నా ఎక్కడా ఈ చిత్రం టాపిక్ లేకపోవటం వారిని నిరాశపరుస్తోంది. రామ్ చరణ్ రచ్చకి వచ్చిన క్రేజ్ ఈ చిత్రానికి తేలేకపోయారని నాగార్జున బాధపడుతున్నారని వినికిడి. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చే్స్తోంది. కీలకమైన పాత్రలో తమిళ హీరో శ్రీకాంత్ చేస్తున్నాడు.సినిమా షూటింగ్ ఎక్కువ బాగం అమెరికాలోనూ,బ్యాంకాక్ లోనూ జరిగింది. నాగచైతన్య హీరోగా, అజయ్ భుయాన్ దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'దడ". దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలను రీసెంట్ గా విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











