దర్శకుడిపై నాగార్జున ఆగ్రహం.. కొడుకు కోసం ఆ రేంజ్‌లో ఫైర్!

సాధారణంగా నాగార్జునకి ఎవరైనా దర్శకులు నచ్చితే వారిని తన ఇంట్లో బంధువుగా ట్రీట్ చేస్తాడు. మాంచి సినిమా తీస్తే సొంత ప్రొడక్షన్ లొనే మరొక సినిమా చేసేందుకు అవకాశం ఇస్తాడు. అయితే రీసెంట్ గా ఒక దర్శకుడు చేసిన పనికి తీవ్ర ఆగ్రహానికి లోనయినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరోలల్లో ఒక్కరితో వర్క్ చేసినా చాలు నెక్స్ట్ ఆ ఫ్యామిలిలోనే మరొక ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది.

దర్శకుడిపై అసహనం..

దర్శకుడిపై అసహనం..

చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో సపోర్ట్ చేశారు. అయితే ఎంత స్టార్ దర్శకుడు అయినా సరే నాగ్ కి నచ్చకపోతే వెంటనే కోటింగ్ ఇచ్చేస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల గీతగోవిందం దర్శకుడైన పరశురామ్ కూడా నాగార్జునను అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది.

కొడుకు కెరీర్ కోసం..

కొడుకు కెరీర్ కోసం..

నాగ చైతన్య పరశురామ్ తో కొన్ని వారాల క్రితం ఒక స్క్రిప్ట్ లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ సెట్టయ్యింది అనుకున్న సమయంలో చైతూని కాదని మహేష్ బాబుతో కొత్త సినిమా చేయడానికి అతని చుట్టూ తిరుగుతున్నాడట. దీంతో నాగార్జునకి అతని తీరు ఏ మాత్రం నచ్చలేదట. అతని కోసం షెడ్యూల్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ముందు పూర్తి చెయ్యమని చెప్పాడట.

దొబ్బేయ్ అన్నారట..

దొబ్బేయ్ అన్నారట..

"ఇక పరశురామ్ తో ఎలాంటి సినిమా చేయాల్సిన అవసరం లేదు దొబ్బేయ్ అను.." అని నాగచైతన్యకు నాగ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎవరిని మనం బ్రతిమాలుకోవాల్సిన అవసరం లేదని దర్శకుడి తీరు ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పారట. ఇక పరశురామ్ అయితే మొదట మహేష్ తోనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ మొదట మహేష్ ఒప్పుకోలేదు. దీంతో నాగచైతన్యతో సినిమా మొదలు పెట్టారు. ఆ తరువాత స్క్రిప్ట్ చేంజ్ చేశాక ఇప్పుడు మహేష్ వెంటనే చేయాలని అసక్తి చూపిస్తున్నాడట. అదే దర్శకుడిని కన్ఫ్యూజన్ లో పడేసింది

Recommended Video

Naga Chaitanya Emotional Words On Police
లవ్ స్టోరీ వాయిదా..

లవ్ స్టోరీ వాయిదా..

ప్రస్తుతం చైతు శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆ సినిమా పనులన్నీ ముగిశాయి. రిలీజైన పాటలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సాయి పల్లవి నటిస్తున్న ఆ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా రిలీజ్ మరీంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X