మళ్ళీ రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో భక్తిరస చిత్రం డిటేల్స్
గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు వచ్చిన సంగితి తెలిసిందే. ఈ సారి మరో భక్తి రస చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.రాఘవేంద్రరావు తన ఆస్ధాన రచయిత జె.కె.భారవి రాసిన షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర స్క్రిప్టుని నాగార్జునకి వినిపించినట్లు సమాచారం.నాగార్జున వెంటనే దానిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే షిర్డీ సాయిబాబా ఏజ్ గ్రూప్ కి సరిపోయేటట్లు ఎలా సరిపోతానో అన్నట్లు నాగార్జున అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్తన్నారు.దానికి రాఘవేంద్రరావు సంతృప్తికరంగా సమాధానం చెప్పి ఒప్పించినట్లు వినపడుతోంది.ఇక ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇంకా బయిటకు రాలేదు. అంతా ఓకే అనుకుంటే త్వరలోనే ఈ కాంబినేషన్ మరో రికార్డుని క్రియోట్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











