సంక్రాంతిపై ఫోకస్ పెట్టిన మరో సీనియర్ హీరో.. RRR , మహేష్ , పవన్ ఉన్నా తగ్గట్లేదు!

పండగ సీజన్లో తెలుగు సినిమాలో ఎలాంటి వసూళ్లను అందుకుంటాయో ఇటీవల కాలంలో విడుదలైన కొన్ని సినిమాల్లో రుజువు చేశాయి. ఆఖరికి 2 వారాల క్రితం విడుదలైన సినిమాలు కూడా సంక్రాంతి రోజు ఎంతో కొంత లాభాలను అందిస్తాయని లవ్ స్టోరీ సినిమా ఇటీవల నిరూపించింది. ఏది ఏమైనా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తే పండుగ సీజన్ సినిమాలకు భారీగా లాభాలు వస్తాయని చాలా క్లారిటీ గా అర్థమైంది. అన్నిటికంటే ఎక్కువగా సంక్రాంతి ఫెస్టివల్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైనది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫెస్టివల్ సీజన్ లో యావరేజ్ సినిమాలకు కూడా భారీ స్థాయిలో లాభాలు వస్తాయని చాలా సినిమాలు రుజువు చేశాయి. ఇక అందుకే 2022 పొంగల్ భరిలో పోటీ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు నమ్మకంతో విడుదల అవుతున్నాయి.

తప్పకుండా ఒక సినిమా కలెక్షన్స్ మరొక సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందని ఎందరికో తెలుసు. కానీ మంచి టాక్ వస్తే మాత్రం ఎవరో ఒకరు మాత్రమే డామినేట్ చేయగలరు అని చెప్పవచ్చు. అయితే నిర్మాతలు అందరూ కూడా ఎవరికి వారు వారి సినిమాలు బెస్ట్ అని సంక్రాంతి పోటీలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. జనవరి 7 న RRR ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు అందరి కంటే ముందుగానే సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతి భరిలో ఉంచాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను కూడా అదే సమయంలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. రెబల్ స్టార్ ప్రభాస్ వారికి కొంచెం గ్యాప్ ఇచ్చి రాధేశ్యామ్ సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు.

Nagarjuna bangarraju movie also focusing on 2022 sankranthi

నిజానికి ఈ మధ్యలో మరొక సినిమా రావడం అంటే సాహసమనే చెప్పాలి. సాధారణంగా ఎవరు అయితే డేర్ చేయరు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం బంగార్రాజు సినిమాను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే 2016లో సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బంగార్రాజు సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూస్తారు అనే నమ్మకం తో నాగార్జున సంక్రాంతిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందట.

ఈ సినిమాలో నాగచైతన్య కృతి శెట్టి కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని నాగార్జున నమ్మకంతో ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రమ్యకృష్ణ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాతో బెస్ట్ హిట్ అందుకున్న తరువాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే మళ్ళీ సంక్రాంతి భరిలోనే పోటీపడి బంగార్రాజు సినిమాతో బాక్సాఫీస్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X