గోవాలో నాగార్జున దుకాణం!
ఒక మంచి యాక్టర్‌గానే కాకుండా, బిజినెస్ మేన్‌గానూ రాణిస్తున్న సినీ నటుడు నాగార్జున తన వ్యాపార సామ్రాజ్యాన్ని రాష్ట్రం ఎల్లలు దాటించే ప్రయత్నంలో ఉన్నాడు. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం గోవాలో ఓ కాసినో ఏర్పాటు చేసే ఆలోచనలో నాగార్జున ఉన్నాడని తెలుస్తోంది. నిత్యం దేశ విదేశీ పర్యాటకులతో కళకళలాడే సముద్రతీరం గోవాలో ఈ తరహా వ్యాపారానికి మంచి ఆదరణ ఉండడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే నాగ్ గోవా వ్యాపారం వార్తలపై నిజానిజాలు తేలాల్సి ఉంది. ఈ హీరో ఇప్పటికే హైదరాబాదులో రెస్టారెంట్ బిజినెస్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికొస్తే...నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'షిరిడి సాయి' చిత్రం చేస్తున్నాడు. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడిగా కనిపించిన నాగార్జున్ తొలిసారిగా ఈ సినిమాలో దేవుడి పాత్రలో సాయిబాబాగా నటిస్తున్నాడు. మరో వైపు నాగార్జున నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'ఢమరుకం' విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











