కొడుకుతో ‘గౌరవం’ దక్కుతుందనే నాగ్ అలా..?

By Bojja Kumar

అక్కినేని నాగార్జున ప్రయోగాలకు పెట్టింది పేరు. కొత్త వారిని ప్రోత్సహించడంలోనూ నాగార్జున తర్వాతే ఎవరైనా. మల్టీస్టార్ చిత్రాల్లోనూ నాగార్జునది అంద వేసిన చేయి. తాజా ఈ హీరో తొలిసారి తన తనయుడితో కలిసి తెరపై దర్శనం ఇవ్వబోతున్నాడు. నాగచైతన్య కథానాయకుడిగా 'గగనం' దర్శకుడు రాధామోహన్ దర్శకత్వంలో 'గౌరవం' చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించనున్నారు. ఒకే సారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ ప్రత్యేకమైన అతిథి పాత్రలో నటించనున్నాడని సినీ వర్గాలు సమాచారం. గౌరవం సినిమాలో కొడుకుతో కలిసి నటించదగ్గ గౌరవ ప్రదమైన పాత్ర లభించడంతో నాగ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

నాగార్జున నటించిన తాజా సినిమా 'రాజన్న' ఈ నెల 22న విడుదలకు సిద్దం అవుతోంది. విజయేంద్రవర్మ, రాజమౌళి సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నాగార్జున సినీ కెరియర్ లోనే ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందిన అంతా భావిస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం ఢమరుకం చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X