దుమారం రేపుతున్న నాగ్ స్మోకింగ్ ఫోటో!
ఇటీవల ఓ రెస్టారెంట్ ఓపెనింగ్‌లో భార్య అమలతో కలిసి పాల్గొన్న నాగార్జున...ఆ ఫంక్షన్లో మద్యం సేవిస్తూ... పొగతాగుతూ కనిపించడం, ఆ ఫోటో కాస్తా మీడియాకు లీకవడంతో దురమారం రేపుతోంది. మద్యం సేవించడం, స్మోకింక్ చేయడం ఆయన పర్సనల్ విషయం అయినప్పటికీ.... .ప్రస్తుతం నాగార్జున షిరిడి సాయి సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి సర్వత్రా దీని గురించే చర్చ.
సాధారణంగా భక్తిరస చిత్రాలు చేసేప్పుడు నటులు చాలా నిష్ఠగా ఉంటుంటారు. నాగార్జున కూడా తాను అలాగే ఉంటున్నానని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే నాగార్జున తన మాటలను ఆచరణలో పెట్టడం లేదని అనుకుంటున్నారు. ఓ దేవుడిగా తెరపై నటిస్తూ చూడ్డానికి ఇబ్బంది కరంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అమల చేతిలో ఉన్న పానీయంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.
నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో గతంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'షిరిడి సాయి' చిత్రంపై కూడా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన నాగార్జున షిరిడి సాయి గెటప్ అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథ సమకూర్చగా.... సాయికృపా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా వేద వ్యాస్, చంద్రబోస్ లిరిక్ రైటర్స్‌గా పని చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటల అందిస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం.


Click it and Unblock the Notifications











