కేక పుట్టిస్తున్న నాగ్ కొత్త లుక్!: 58ఏళ్ల వయసులో ఈ సిక్స్ ప్యాక్ చూశారా?

Recommended Video

కేక పుట్టిస్తున్న నాగ్ కొత్త లుక్ !

'శివ' భారతీయ సినిమాలకు ఓ కొత్త చూపునిచ్చిన సినిమా. అప్పటిదాకా ఒకే రకం స్క్రీన్ ప్లే, పిక్చరైజేషన్‌కు అలవాటుపడ్డ సినీ జనాలకు శివ స్లో పాయిజన్ లా ఎక్కింది.

ఇలాంటి కథలు కూడా తెరకెక్కించవచ్చా? అన్న ఆలోచన రేకెత్తించింది. అలా శివ ప్రస్థానం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే నాగ్-వర్మ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే మళ్లీ అలాంటి అంచనాలే వెంటాడుతున్నాయి.

 ఈ కాంబినేషన్ ఎప్పటికీ స్పెషలే:

ఈ కాంబినేషన్ ఎప్పటికీ స్పెషలే:

సినిమాల్లో కొన్ని కాంబినేషన్స్ పట్ల ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నాగ్-వర్మ కాంబినేషన్ మరింత స్పెషల్. 28ఏళ్ల క్రితం 'శివ'తో వీరిద్దరు చేసిన మ్యాజిక్ ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. కాబట్టే.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా కోసం అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 నాగ్ అంటే వర్మకూ స్పెషలే..:

నాగ్ అంటే వర్మకూ స్పెషలే..:

వర్మకు నాగ్ అంటే ముందు నుంచి స్పెషల్ ఇంటెన్షన్ అనే చెప్పాలి. ఆయన ఎవరిని గౌరవించినా.. గౌరవించకపోయినా నాగ్‌ను మాత్రం ఎప్పుడూ పల్లెత్తు మాట అనడు. పైగా సందర్భం వచ్చిన ప్రతీసారి ఆయనపై ప్రత్యేకంగా ప్రేమ చాటుకుంటూనే ఉంటాడు.

కొత్త లుక్:

కొత్త లుక్:

నాగ్‌ను ఈసారి మరో కొత్త లుక్ లో ప్రెజెంట్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు మరో లుక్ కూడా హల్ చల్ చేస్తోంది. నాగ్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్న ఫోటో ఒకటి బయటకు రావడంతో.. వర్మ సినిమాలో ఇలాగే కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

 నిజమేనా?..:

నిజమేనా?..:

2017సంవత్సరంలో తన జీవితంలో చోటు చేసుకున్న మరిచిపోలేని సంఘటనలను సోషల్ మీడియా పోస్టు చేశారు నాగ్. పోస్టు రూపంలో అనేక ఫోటోలను కలగలిపి పెట్టారు. అందులో నాగ్ షర్ట్ లేకుండా.. సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఫోటో ఒకటి ఉంది. దీంతో ఈ ఫోటో వర్మ సినిమాకు సంబంధించిందే అన్న ప్రచారం మొదలైంది. 58ఏళ్ల వయసులో నాగ్ ఇంత ఫిట్‌గా కనిపిస్తుండటంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X