నాగార్జునకు మరో షాక్.. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రద్దు.. అసలేం జరిగిందంటే..
విభిన్నమైన చిత్రాలను చేయడంలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునకు పెట్టింది పేరు. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎన్నడూ ముందుంటారు. తాజాగా బాలీవుడ్, తమిళ చిత్రాలతో జోష్ కొనసాగిస్తున్నారు. అయితే తమిళంలో నాగార్జున నటించే చిత్రం నిలిచిపోయిందనే వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

హీరో ధనుష్ దర్శకత్వంలో
తమిళంలో మారి-2 తర్వాత ధనుష్ రెండోసారి దర్శకత్వం వహించే చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రను చేసేందుకు అంగీకరించాడు. భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రంలో అద్భుతమైన పాత్రను చేయాల్సి ఉంది. శ్రీ తేనాండళ్ ఫిల్మ్ రూపొందించనున్నది. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు సమాచారం.

రాజకీయపరమైన సమస్యలతో
విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించి క్రియేటివ్ సమస్యలు తలెత్తాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే రాజకీయపరమైన సమస్యలు వచ్చే ఉన్నందున చిత్రాన్ని నిలిపివేసినట్టు తెలిసింది.

అధికారికంగా ప్రకటించే అవకాశం
ధనుష్ రెండోసారి దర్శకత్వం వహించే ప్రాజెక్టు నిలిపివేతపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చాలాకాలం తర్వాత తమిళంలో నటించాలనే నాగార్జున ఆశలకు గండిపడింది. అయితే మలయాళంలో రూపొందే మహాభారతంలో కీలకపాత్ర పోషించనున్నారు.

బాలీవుడ్ చిత్రంలో నాగార్జున
అలాగే బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ రూపొందించే బ్రహ్మస్త్ర చిత్రంలో నాగార్జున కీలక భూమికను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. ఈ చిత్రం 2019లో విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











