'తడాఖా' దర్శకుడు నెక్ట్స్ చిత్రం..
ఈ లోగా..నాగార్జున పిలిచి..తానతో చిత్రం ప్లాన్ చేయమని పురమాయించినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తానని మాట ఇవ్వటంతో నాగ్,ఆండ్రియా కాంబినేషన్ లో డాలి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కే అవకాసం ఉంది.
ఇక నాగార్జున ప్రస్తుతం 'భాయ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ ఇందులో కథానాయిక.
ఈ చిత్రంలో హంసా నందిని స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ చిత్రంలోని ఓ పెళ్లి పాటలో హంసా నందిని కనిపించబోతోంది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల మీడియాకు వెల్లడించారు. మరో వైపు బ్రెజిల్ భామ నథాలియా కౌర్ 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు. ఇటీవలే వీరిపై పాట చిత్రీకరణ జరిగింది.


Click it and Unblock the Notifications












