సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ చెయ్యబోతున్న నాగార్జున!
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో బంగార్రాజు పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు నాగార్జున. సినిమాకు బంగార్రాజు పాత్ర హైలెట్ గా నిలిచింది. తాజాగా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు బంగార్రాజు పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ప్రస్తుతం నేలటికెట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాకు దర్శకత్వం వహిస్తాడని సమాచారం. జూన్ 25న ఈ సినిమా ను ప్రారంభిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన స్క్రిప్ట్‌వర్క్ ప్రారంభించినట్లుగా తెలిసింది.

సోగ్గాడే చిన్నినాయనా తరహాలోనే బంగార్రాజు సినిమా వినోదం, సెంటిమెంట్ అంశాల్ని మేళవించి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున తాజాగా నటించిన చిత్రం ఆఫీసర్ మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆఫీసర్ సినిమా తరువాత నాగార్జున చెయ్యబోయే సినిమా బంగార్రాజు అని సమాచారం. ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











