అల్లు అర్జున్ ప్రాజెక్టుని వద్దనుకుంటున్న నాగార్జున-కారణం?
తన కుమారుడు నాగచైతన్యకి 100% లవ్ తో సూపర్ హిట్ ఇవ్వటంతో హ్యాపీగా ఉన్న నాగార్జున అందుకు ప్రతిగా అల్లు అర్జున్ తో తమ అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. ఈ లోగా సుకుమార్ హిందీలో 100% లవ్ చిత్రం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే హిందీ వెర్షన్ లో హీరోగా రణబీర్ కపూర్ ని హీరోగా ఎంచుకున్నారని తెలిసింది. అంతేగాక హీరోయిన్ గా తమన్నానే కంటిన్యూ చేస్తున్నారు. తమ కుమారుడునే రీమేక్ వెర్షన్ కి కూడా తీసుకుంటారని ఆశించిన నాగార్జునకి ఆశాభంగం అయింది. దాంతో నాగ్ తాను అల్లు అర్జున్ తో అనుకున్న ప్రపోజల్ ని వద్దనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం నాగార్జున, అనూష్క కాంబినేషన్ లో ఢమురుకం చిత్రం రూపొందుతోంది. కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఆ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications