2027 సంక్రాంతి రేసులోకి నాగార్జున.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ సిక్వెల్‌తో పోటీ..
Nagarjuna: టాలీవుడ్ కు సంక్రాంతికి వీడదీయలేని సంబంధం ఉంటుంది. సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు కూడా. ప్రతి ఏడాది ఈ పండగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని భారీ సినిమాలు క్యూ కడుతుంటాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి కింగ్ నాగార్జున పేరు కూడా చేరింది. 2027 సంక్రాంతి బరిలో దిగేందుకు నాగార్జున రెడీ అవుతున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఇచ్చిన సర్ప్రైజ్ అప్డేట్‌తో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం పీక్స్‌కు చేరగా... మరోవైపు మెగాస్టార్ సహా ఇతర అగ్ర హీరోల సినిమాలు కూడా అదే సీజన్‌కు ప్లాన్ అవుతుండటంతో 2027 సంక్రాంతి అసలైన స్టార్ వార్‌గా మారబోతుందన్న అంచనాలు మొదలయ్యాయి.
తాజాగా అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studios) చేసిన అనౌన్స్‌మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'వాసివాడి తస్సాదియ్యా... 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తున్నారు' అంటూ జనవరి 15, 2027ను రిలీజ్ డేట్‌గా మార్క్ చేయమని స్టూడియో ప్రకటించడంతో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. హీరో పేరు, సినిమా టైటిల్ అధికారికంగా వెల్లడించకపోయినా.. ఈ అప్డేట్ వెనుక ఉన్నది మాత్రం కింగ్ నాగార్జున అనే విషయం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే... 'వాసివాడి తస్సాదియ్యా' అనేది నాగార్జున నటించిన బంగార్రాజు సినమాలోని ఫేమస్ అయిన డైలాగ్. అంతకుముందు వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన'తో నాగార్జున ఫ్యామిలీ ఆడియెన్స్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'బంగార్రాజు'తో ఆ ఫ్రాంచైజ్‌ను కొనసాగించారు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం కల్యాణ్ కృష్ణ వహించారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఇచ్చిన ఈ హింట్‌తో 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' తర్వాత మూడో పార్ట్ రాబోతుందా? మళ్లీ నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా కనిపించనున్నారా? లేక అదే కాంబినేషన్‌లో పూర్తిగా కొత్త కథతో సినిమా తెరకెక్కుతోందా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలే. అధికారిక డీటెయిల్స్ కోసం ఇంకా వేచి చూడాల్సిందే.
2027 సంక్రాంతి అంటే మినీ బాక్సాఫీస్ యుద్ధమే!
ఇప్పటికే పలువురు అగ్ర హీరోలు అదే సీజన్‌కు తమ సినిమాలను లాక్ చేసుకోవడంతో 2027 సంక్రాంతి రేస్ హాట్‌గా మారింది. ఇక నాగార్జున ఎంట్రీతో ఇవ్వడంతో బాక్సాఫీస్ హీట్ పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి తన 158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లీతో తెరకెక్కిస్తుండగా, గతంలో 'వాల్తేరు వీరయ్య'లా ఈసారి కూడా పండగ విన్నర్ కావాలనే ప్లాన్‌లో ఉన్నారు. అదే సమయంలో వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం 2' కూడా అదే బరిలో నిలవనుంది. కామెడీ -ఫ్యామిలీ టచ్‌తో ఈ సీక్వెల్ బలమైన పోటీ ఇవ్వబోతోంది.
మరోవైపు సూపర్ స్టార్ రజినీ కాంత్ తన 173వ సినిమాతో సంక్రాంతి సందడికి సిద్ధమవుతుండగా, ఈ చిత్రాన్ని కమల్ హసన్ నిర్మిస్తున్నారని టాక్. యంగ్ హీరోలూ వెనకడుగు వేయడం లేదు. శర్వనంద్ తన 39వ సినిమాను శ్రీను వైట్లతో చేస్తున్నారు. అలాగే 'హనుమాన్'తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న తేజా సజ్జా, ఇప్పుడు 'జాంబీ రెడ్డి 2'తో సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడం విశేషం. ఇలా సంక్రాంతి ఒకే సీజన్‌లో నాగార్జున 'సోగ్గాళ్లు' ఫ్రాంచైజ్‌తో పాటు చిరంజీవి, వెంకటేశ్, రజినీకాంత్ లాంటి దిగ్గజాలు... మధ్యలో యంగ్ హీరోల క్రేజీ సీక్వెల్స్ రావడంతో 2027 సంక్రాంతి నిజంగానే హిస్టారిక్ క్లాష్‌గా మారబోతోంది.


Click it and Unblock the Notifications











