నాగార్జున అపద్దాలతో రగడ చేస్తున్నాడు...
నాగార్జున సినిమా విడుదలకు ముందు ఎంత ఉత్సాహంగా ఉంటాడో సినిమా విడుదలయి తర్వాత కూడా ఆ రిజల్ట్ గురించి పట్టించుకోకుండా అంతే ఉత్సాహంగా ఉంటాడు. కష్టపడి పిన చేయడం వరకే మన వంతు..ఆపై రిజల్ట్ మన చేతుల్లో లేదు అన్నట్టుగా నాగ్ ధోరణి ఉంటుంది. కానీ తాజాగా నాగ్ ధోరణిలో మార్పు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. దానికి కారణం ఇటీవల విడుదలైన తన చిత్రం 'రగడ" కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయనీ..వసూళ్ళు పెరిగాయని చెప్పుకొస్తున్నాడు నాగార్జున. కానీ ఈ విషయం నిజం కాదనీ, నాగ్ మాటలు ఫేక్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా వసూళ్లు పెరగలేదని, కాకపోతే వరుస ప్లాప్ లతో ఉన్న నాగార్జున ఈ విధంగా మాట్లాడిన తన సినిమాలకి బూస్ట్ ప్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా మాట్లాడుతున్నాడని పరిశీలకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











