వాసు వర్మ పై మండిపడుతున్న నాగ్ ఫ్యాన్స్
తమ అభిమాన హీరో నాగార్జున తనయుడు నాగ చైతన్య కథానాయకుడిగా పరిచయమవుతున్నాడంటే నాగార్జున అభిమానులు సంబరపడిపోయారు. ఆ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూసారు. దీనికి తోడు ఈ చిత్రాన్ని అపజయమెరుగని రాజు 'దిల్' రాజు నిర్మిస్తుండటంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా మంచి 'జోష్' వున్న టైటిల్ పెట్టడంతో నాగార్జున కెరీర్ లో 'శివ' లాగా చైతన్య కెరీర్ లో ఈ సినిమా మిగిలిపోతుందని ఆశించారు.
తాము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయింది. కానీ ఈ సినిమా సామాన్య ప్రేక్షకుడినే కాక నాగ్ అభిమానులని కూడా నిరాశపరిచిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎంతో నమ్ముకొని సినిమాని తన చేతిలో పెడితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసాడని నాగ్ అభిమానులు వాసు వర్మ పై మండి పడుతున్నారట. ఈ పరిణామాల పై వాసు కూడా అసంతృప్తితో వున్నాడట. తిరిగి మరో అవకాశం వస్తే నేనేంటో చూపిస్తానని అంటున్నాడట. కానీ అవకాశాలు ఎప్పుడూ రావని, వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని వాసుకు ఉచిత సలహాలు ఇస్తున్నారట విన్న వారు. పూర్ వాసు వర్మ....


Click it and Unblock the Notifications











