భయపడుతున్న నాగార్జున?
అవును, నాగార్జున భయ పడుతున్నాడు. దేని కోసమో తెలుసా? నాగ చైతన్య భవిష్యత్ గురించి. ఏమాయ చేశావె, 100% లవ్ చిత్రాల సక్సెస్ తో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న చైతు కెరియర్ ఈ మధ్య దడ ప్లాపుతో మళ్లీ సంశయంలో పడింది. ప్రస్తుతం నాగ చైతన్య రామ్ గోపాల్ వర్మ సినిమా 'బెజవాడ"తో పాటు, దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్ సూర్య" చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో తొలుత విడుదలకు సిద్దం అవుతున్న సినిమా 'బెజవాడ".
'బెజవాడ" సినిమాపై మొదటి నుంచి ముసురుకున్న వివాదాలు, ఈ సినిమా టైటిల్ పై రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి చేస్తున్న ఓవర్ యాక్షన్...బెజవాడ జనాలు చివరకు ఛీ కొట్టే వరకు వెళ్లాయి. బెజవాడ రౌడీలు అనే టైటిల్ మార్చమంటూ చాలా రోజులు ఆందోళనలు చేసిన తర్వాత సినిమా పేరును 'బెజవాడ"గా మార్చాడు వర్మ. ఓ క్రమంలో సినిమాను బహిష్కరిస్తామంటూ బెజవాడ వాసులు హెచ్చరించే వరకు వెళ్లింది.
దీంతో 'బెజవాడ" పరిస్థితి ఏమౌతుందో అనే ఆందోళనలో నాగార్జున ఉన్నాడని అంటున్నారు. స్టోరీ అంతా విని, నాగ చైతన్యకు కథ సూటవుతుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే నాగార్జున ఈ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా హిట్టవుతుందనే నమ్మకం నాగార్జునలో మొదటి నుంచి ఉంది. అయితే, ఒక వేళ విధి వక్రీకరించి సినిమా దొబ్బితే ఏమిటి పరిస్థితి అనేదనే నాగ్ ఆందోళన. ఈ మధ్య నాగార్జున స్టోరీ జడ్జిమెంట్ సరిగా వర్కౌట్ కావడం లేదు. అదే జరిగితే కొడుకు పరిస్థితి మళ్లీ మొదటికి రావడం ఖాయం. మరి ఏం జరుగబోతోందో? చూడాలి.


Click it and Unblock the Notifications











