నాగార్జున కోసం కథలు విటున్న భూమిక
నాగార్జున రీసెంట్ గా భూమిక నిర్మించిన తకిట తకిట చిత్రంలో గెస్ట్ గా చేసారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా ఫలితం నమోదయింది. దాంతో డిప్రెషన్ లో ఉన్న భూమికను ఓదార్చటానికి అన్నట్లు ఆమె బ్యానర్ డౌన్ టౌన్ ఫిలిమ్స్ పై ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చి సైన్ చేసారు. అయితే భూమిక వద్ద కథ గానీ దర్శకుడు గానీ లేరట. దాంతో నాగార్జున డేట్స్ ఉన్నాయి కాబట్టి కథలు వినాలని భూమిక నిర్ణయించుకుందిట. భారీ బడ్టెట్ తో నిర్మాణమయ్యే ఈ చిత్రంలో హీరోయిన్ గా అనూష్క ఉండనుందని సమాచారం. ఇక భూమిక ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి పరుచూరి మురళి చిత్రంలో చేస్తోంది. ఇక నాగార్జున తో చిత్రం అనేసరికి భూమక భర్త భరత్ ఠాకూర్ కూడా ఉత్సాహం చూపించి ఎంత బడ్జెట్ అయినా ఫరవాలేదు..హిట్టు కొట్టాలని చెప్తున్నారుట.
నాగార్జున భూమిక భరత్ ఠాకూర్ తకిట తకిట డౌన్ టౌన్ ఫిలిమ్స్ బాలకృష్ణ nagarjuna bhumika bharat takore takita takita downtown films


Click it and Unblock the Notifications