'ఆ నలుగురు' చంద్ర సిద్దార్దతో స్టార్ హీరో చిత్రం
నాగార్జున, దర్శకుడు చంద్ర సిద్దార్ద కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ విషయం మీడియా వర్గాలకు చంద్ర సిద్దార్ధ స్వయంగా తెలిపారు. ఇక చంద్ర సిద్దార్ద లేటెస్ట్ చిత్రం అందరి బంధువయా చిత్రం మంచి చిత్రమని పేరు తెచ్చుకున్నా ఊహించిన విధంగా వర్కవుట్ కాలేదు. పద్మప్రియ వంటి ఆర్టిస్టు హీరోయిన్ గా చేసినా కమర్షియల్ విలువలు లేవని సినిమాని ప్రక్కన పెట్టేసారు. దాంతో తన కథలకు కమర్షియల్ హీరో తోడయితే ..బంగారు కంచానికైనా గోడ చేరువ కావాలన్న రీతిలో సినిమా ప్రజల్లోకి వెళ్ళుతుందనే ఆలోచనతో చంద్ర సిద్దార్ధ ఈ కొత్త కాంబినేషన్ కి శ్రీకారం చుడుతున్నట్లు చెప్తున్నారు. అలాగే వీరు పోట్లతో నాగార్జున చేస్తున్న చిత్రం అనంతరం ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ నలుగురు చిత్రం చూసాక నాగార్జున..చంద్ర సిద్దార్ధ తో సినిమా చేయాలని ఆశించారని, అది ఇప్పుడు నెరవేరబోతోందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











