నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ డిటేల్స్..
నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని,వారి కోరిక తీరబోతోందని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం వ్రకారం వీళ్లిద్దరూ కలిసి చేసే చిత్రానికి సబ్జెక్ట్ ఓకే అయిందని తెలుస్తోంది. ఇంతకుముందు నాగచైతన్య... నాన్నగారితో కలిసి సినిమా చేయాలని ఉంది. ఆయన కూడా నాతో కలిసి సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇద్దరం కలిసి సినిమా తప్పకుండా చేస్తాం అంటున్నాడు నాగచైతన్య. అయితే ఇద్దరికీ సరిపోయే... మంచి కథ దొరికాలి అన్నాడు. ఇప్పుడది నిజం కాబోతోంది. తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి 'గౌరవం సిని మాలో నటిస్తారని వార్తలు వచ్చి నప్పటికీ ఈ చిత్రంలో నాగార్జున అతిథి పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. కానీ సబ్జెక్ట్ ఓకే అయిన చిత్రంలో ఇద్దరూ హీరోలుగా నటించబోతున్నారని చెప్తున్నారు.
ఓ కొత్త దర్శకుడు వీళ్లిద్దరికీ సరిపోయే సబ్జెక్ట్ చెప్పి ఇద్దరినీ ఒప్పించాడట. కానీ ఏ బ్యానర్‌లో ఈ సినిమా వస్తుంది..ఎప్పుడు ప్రారంభిస్తారు..అన్న విషయాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2012లోనే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జె ట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుం టుందని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా రానుందని సమాచారం. ప్రస్తుతం నాగార్జున ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'రాజన్న గురువారం విడుదల అవుతోంది. అలాగే నాగార్జున మరో చిత్రం 'డమరుకం షూటింగ్ జరుగుతోంది. మరో ప్రక్కన నాగచైతన్య ఆటోనగర్ సూర్య షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్దానంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దేవకట్టా ఈ చిత్రాన్ి డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











