ఆ కేసులో అఖిల్‌ను ఇరికించడంపై నాగార్జన ఫైర్!
ఫార్ములావన్ రేసర్ అఖిల్ కుష్ లానీ తాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే అసలు విషయం తెలుసుకోకుండా కొన్ని మీడియా ఛానల్స్ అఖిల్ అనగానే నాగార్జున కొడుకు అంటూ స్ర్కోలింగ్ రన్ చేశారు. కొంత సేపటికి అసలు విషయం తెలుసుకుని ఆ స్ర్కోలింగ్ తొలగించి..ఫార్ములా 1 రేసర్ అని చెప్పారు. అయితే అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున కొడుకు తాగి పట్టబడ్డాడనే విషయం తెలిసి పోయింది. వార్తలు త్వరగా కవర్ చేయాలనే ఆతృతతో మీడియా ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై నాగార్జున మండి పడ్డట్లు సమాచారం. ఇకపై తన గురించి, తన కుటుంబం గురించి తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని అన్నట్లు తెలిసింది.
ఆ గొడవ సంగతి పక్కన పెడితే...నాగార్జున నటించిన 'రాజన్న' సినిమా డిసెంబర్ 22న విడుదలవుతోంది. నిజాం పాలనలో జరిగిన ఓ చారిత్రక ఘట్టాన్ని ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున స్వయంగా నిర్మాత. రాజమౌళి యాక్షన్ పార్టును డైరెక్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











