అనుష్క గెటప్ చూసి పూనకం తెచ్చుకున్న జూనియర్ ఆర్టిస్ట్!

By Sindhu

అరుంధతి చిత్రంతో వచ్చిన పేరుతో అన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలే ఆహ్వానిస్తున్నా..దైర్యంగా వాటిని చేయడానికి ముందుకొస్తుంది..అందాల బొమ్మాళీ అనుష్క.. ప్రస్తుతం ఆమె నటించిన..సముద్ర దర్శకత్వంలో మేకప్ మ్యాన్ చంద్ర నిర్మించిన 'పంచాక్షరి" చిత్రం జూన్ నాల్గవ తేదీన సుమారు 200 వందల ప్రింట్లతో విడుదల కానుంది.

గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 'అమ్మోరు" చిత్రంలో రమ్యకృష్ణ గుర్తుండే ఉంటుంది. మరచిపోయే అవతారమా అది ప్రస్తుతం పంచాక్షరి చిత్ర వాల్ పోస్టర్స్ లో అనుష్కను చూసిన వారు కూడా అచ్చం అమ్మోరులానే ఉందని కితాబులిచ్చేస్తున్నారు. అంతే కాదు ఈ చిత్ర షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ కి అనుష్క గెటప్ చూసి పూనకం కూడా వచ్చిందట. ఆమెను శాంతింపజేయడానికి యూనిట్ సభ్యులు నానా కష్టాలు పడ్డారట.

మరోవైపు ఇప్పటికే ఈ చిత్రాన్ని తిలకించిన ఈ చిత్ర సమర్సకునిగా ఉన్న నాగ్ అనుష్క నటన చూసి ఆమెను పొగడకుండా ఉండలేకపోతున్నాడట. అంత చక్కగా పాత్రలో లీనమైన అనుష్కను నాగ్ తన ప్రతిచిత్రంలో ఏదో ఒక పాత్రలో చూసుకోవాలని అనుకునేంతగా ఆమె నటన ఆకట్టుకుందంటే చిత్రం విజయం పై సందేహాలు అవసరం లేదని విమర్శకులు అభిప్రాయం.

అలాగే 'పంచాక్షరి" పోస్టర్స్ చూసిన కొందరు మహిళలు అమ్మోరు పాత్రలో ఉన్న అనుష్కకు పసుపు, కుంకమలు రాసి పూజలు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని నిర్మించిన బొమ్మదేవర కూడా చిత్రం గ్యారంటీగా విజయం సాధిస్తుందని అప్పుడే శతదినోత్సవ వేడుకలు జరపడానికి కూడా రంగం సిద్ద చేసుకుంటున్నాడు. విడుదలకు ముందే ఈ చిత్రం పలు రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఇప్పటి వరకు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు 200 ప్రింట్లతో విడుదల కాలేదు. అలాగే విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలోనికి కూడా ఈ చిత్రం చేరింది. ఇప్పటికి పలు రికార్డులు వచ్చిపడటంతో పాటు టేబుల్ ప్రాఫిట్ కూడా రావడంతో నిర్మాత చంద్ర ఆనందం పట్టలేక. ఈ చిత్ర శతదినోత్సవ వేడుకల తేదిని కూడా ప్రకటించేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X