అందుకే...నాగార్జునకి నిద్ర కరువు
నాగార్జున గత రెండు రోజులుగా చాలా టెన్స్ గా గడపారని,దాదాపు రాత్రి నిద్ర కరవయ్యందంటూ ఫిల్మ్ నగర్ లో గుప్పుమంది. కారణం ఏమిటీ అంటే తెలంగాణ..సమైఖ్యాంద్ర గొడవలు జరుగుతున్న నేపధ్యంలో ఆయన హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోని ఓ భూమిని అమ్మేసారు..అయితే దాని ఎమౌంట్ రావటం బాగా లేటయింది. అయితే చాలా కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నాగార్జునకి ఇదేమీ కొత్త కాదుట. అయితే బయిట పరిస్ధితులు బాగోకపోవటంతో కొనుక్కున్న వారు మనస్సు మార్చుకున్నారా అనే సందేహం కలిగిందిట. వారు సెల్ ఎత్తలేదు. అయితే కొద్ది గంటలు ఇలా టెన్షన్ పడ్డాక వారు సీక్రెట్ గా వచ్చి డబ్బు పే చేసారు. ఎందుకిదంతా అంటే భాక్స్ లలో డబ్బు తెస్తున్నాం..ఎవరికి తెలిసినా ప్రమాదమే. అందుకే ఇలా సీక్రెట్ గా చెయ్యాల్సివచ్చిందన్నారు. అయితే ఆ బాక్స్ తీసుకున్న నాగార్జున తిరిగి దాన్ని మరో చోట ఇన్వెస్ట్ చేసే దాకా నిద్రపోడని ఆయన గురించి తెలుసున్న వారు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











