యంగ్ టైగర్ దెబ్బకు భయపడి సినిమాని వాయిదా వేసుకున్న కింగ్..!
జూ ఎన్టీఆర్ పై నాగార్జునకి చెప్పలేనంత అభిమానం. ఆ అభిమానాన్ని నాగార్జున చాలా సార్లు ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు. వారిద్దరి బంధం బాబాయి-అబ్బాయి లాంటిదని అన్నారు. ఇటీవల కాలంలో నాగార్జున రాబోయే కాలంలో జా ఎన్టీఆర్ నెంబర్ వన్ అవుతాడని ప్రత్యక్షంగానే చెప్పడం జరిగింది. అలాగే నాగార్జున ఇప్పుడు జూ ఎన్టీఆర్ కోసం తన సినిమాని వాయిదా వేసుకున్నాడు. దిల్ రాజు నిర్మాత గా నాగార్జునతో 'గగనం' అనే సినిమా తీస్తున్నారు. ఐతే బృందావనం సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్న సందర్భంలో, నాగార్జున గగనం సినిమాని ఒక నెల రోజుల తర్వాత విడుదల చేయడానికి అంగీకరించారంట. అంతేకాకుండా 'గగనం' విడుదల చేసిన యాభై రోజుల తర్వాత 'రగడ' సినిమాని విడుదల చేయవచ్చని నాగార్జున అభిప్రాయపడ్డారని అన్నారు.
కాని ఫిలిమ్ నగర్ లో ఇది మరోలా వినిపిస్తుంది. నాగార్జున జూ ఎన్టీఆర్ దెబ్బకు భయపడి కావాలనే ఈ సినిమాని వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా ప్రిన్స్ మహేష్ 'ఖలేజా' కూడా వస్తుండడంతో వీరిద్దిరి మధ్య పోటీ నెలకోని ఉంటుంది. వీరిద్దిరి మధ్యలో మనం ఎందుకులే అంతేకాకుండా ఒకవేళ సినిమా అటు ఇటు అన్నా అసలికే మోసం వస్తుందని తన అభిమానులు మరలా నిరాశ చెందుతారని, ఈ రెంటి తరువాత అయితే వాటి ఫలితం వస్తుంది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీనిని బట్టి నవంబర్ 5న 'గగనం' సినిమాని, డిసెంబర్ 25న 'రగడ' సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











