నాగ్ కూల్ గై అంటూ ఢంకా బజాయిస్తున్న అనుష్క
చిరునవ్వులు పువ్వులు పూయించి, అందరి మనసుల్లో సంతోషాన్ని నింపే సంక్రాంతి అంటే తనకేంతో ఇష్టమని చెబుతుంది అరుంధతి అనుష్క. నేను ఇష్టంగా జుపుకునే సంక్రాంతికి, నాజీవితానికి ఎంతో ముడి పడి ఉందని గత సంక్రాంతికి విడుదల అయిన 'అరుంధతి" తనకు ఎంతగానో మంచి పేరు తెచ్చిపెట్టిందని, ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లానే ఉండాలని కోరుకుంటుంది.
టాలీవుడ్, కోలీవుడ్‌లలో సంచలనాలు సృష్టించిన అనుష్క నాగ్‌తో నటించిన రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. "సూపర్'' చిత్రం తర్వాత "కింగ్''లో ఒక పాటలో నాగ్ సరసన నటించింది అనుష్క. కాగా నాగ్‌తో మూడో ఛాన్స్ కూడా కొట్టేసిన అనుష్క మా కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని ఢంకా బజాయించి మరీ చెబుతోంది. అంతే కాదు "నాగ్ కూల్‌గై... అతనితో నటిస్తుంటే పొద్దే తెలియదు. రొమాంటిక్ సన్నివేశాలూ, డ్యూయెట్లు చేసేప్పుడు నాగ్ అందించే సహకారం మరచిపోలేం. నాగ్‌కి పెయిర్‌గా నటించినప్పుడు సెల్యులాయిడ్ మీద చాలా అందంగా కనిపిస్తాను. అదే నాగ్ మహిమ'' అంటోంది ఈ అందాల సుందరి.


Click it and Unblock the Notifications











