హీరోయిన్స్ కంటే హీరోయే చాలా గ్లామర్ గా ఉన్నాడు...
గ్లామర్ విషయంలో 'రగడ" సినిమాకి నాగార్జునే హైలైట్ అంటోంది హీరోయిన్ ప్రియమణి. అనుష్క గ్లామర్..ప్రియమణి అందాలు.. సిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అందరూ అంటోంటే, టాలీవుడ్ 'మన్మధుఢు" నాగార్జున ముందు తమ గ్లామర్ ఏమాత్రం పనిచేయదంటూ నాగ్ ని ప్రియమణి పొగడ్గలతో ముంచెత్తేసింది. ఇటీవల ఓ సందర్భంలో.
నాగార్జున సరసన నటించాలనేది తనకు డ్రీమ్ అనీ, ఆ డ్రీమ్ 'కింగ్" సినిమాలో ఓ పాటలో కొంత మేర తీరిందనీ, 'రగడ"లో మళ్ళీ నాగ్ సరసన నటించే అవకాశం రావడం, ఈసారి ఫుల్ లెంగ్గ్ రోల్ దక్కడంతో ఆనంద పట్టలేకపోతున్నానని ప్రియమణి చెబుతోంది. అనుష్క గొప్ప నటి మాత్రమే కాదు, వ్యక్తిత్వం పరంగా చాలా మంచి వ్యక్తి అనీ, అనుష్కకీ తనకు మధ్య సన్నిహిత సంబంధాలు 'రగడ" షూటింగ్ లో మరింత పెరిగాయంటోంది ప్రియమణి. 'రగడ" విడుదల కోసం చాలా టెన్షన్ తో ఎదురు చూస్తున్నానంటోన్న ప్రియమణి, 'రగడ" తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే ధీమా వ్యకతం చెస్తోంది.


Click it and Unblock the Notifications











