మల్టీస్టారర్‌గా మహేశ్ - రాజమౌళి మూవీ: ఆ తెలుగు స్టార్ హీరో ఫిక్స్

టాలీవుడ్‌లో ఎంతో కాలంగా వేచి చూస్తున్న కాంబినేషన్లు ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కలిసి చేస్తున్న ప్రాజెక్టు ఒకటి. వీళ్లిద్దరు కలిసి చాలా కాలం క్రితం నుంచే సినిమా చేయాలని అనుకుంటున్నారు.

కానీ, అది వర్కౌట్ కాలేదు. అయితే, త్వరలోనే వీళ్ల ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది. ఈ నేపథ్యంలో ఇందులో టాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తాజాగా క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాలను మీరే చూసేయండి మరి!

Nagarjuna Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్టు: తనదైన శైలి చిత్రాలతో తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేయాలని హీరోలందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ టాప్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారని కూడా పేర్కొన్నాడు. దీంతో దీనిపై హైప్ ఏర్పడింది.

Nagarjuna Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

కథ కూడా పూర్తి చేసేశారు: ఎంతో ప్రతిష్టాత్మకమైన కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్టును పూర్తి చేసినట్లు స్వయంగా తెలిపారు.

Nagarjuna Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

అలాంటి స్టోరీతో కన్ఫార్మ్: హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. దీంతో ఎన్నో హాలీవుడ్ మూవీలను తెరపైకి తెస్తూ ఇది అలాగే ఉంటుందని చెప్తున్నారు.

Nagarjuna Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

అదే పనిలో.. త్వరలోనే: వాస్తవానికి మహేశ్ బాబు.. రాజమౌళి కలయికలో రాబోతున్న సినిమా 2022 ద్వితీయార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఈ మూవీ ప్రీ వర్క్ చేస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రారంభించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

సినిమాలో తెలుగు హీరో: అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టులో మహేశ్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Nagarjuna Key Role in SS Rajamouli and Mahesh Babu Movie

పవర్‌ఫుల్ పాత్రలో నాగ్: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రాబోతున్న సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నాడని తెలిసింది. అంతేకాదు, మహేశ్ బాబుతో సమానమైన స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఉండబోతుందని అంటున్నారు. తద్వారా ఈ చిత్రం మల్టీస్టారర్‌గా రూపొందనుందని టాలీవుడ్‌లో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X