విడాకుల తర్వాత సమంత తండ్రితో నాగ్ కీలక భేటీ.. అందుకే సమంత కూడా?
అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుంచి అనేక రకాల వార్తలు వారి గురించి పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయనే విషయం మీద ఏమాత్రం క్లారిటీ లేదు కానీ వీరి గురించి మాత్రం వార్తలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా విడాకుల తర్వాత మాజీ కోడలు సమంతతో నాగార్జున భేటీ అయినట్లు ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రేమకు దారి తీసి
అక్కినేని నాగచైతన్య సమంత ఏం మాయ చేసావే సినిమా టైంలో కలుసుకున్నారు. అప్పట్లో ప్రేమలో పడలేదు కానీ నెమ్మదిగా స్నేహం మొదలై అది ప్రేమకు దారి తీసింది అని చెబుతూ ఉంటారు. ఇద్దరూ కూడా తమ తమ ఇళ్లలో ఒప్పించి లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. తమ తమ మత సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది.

సినిమాల్లో బిజీ
టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు అని ప్రకటించడంతో అక్కినేని అభిమానులకే కాకుండా సినీ ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే అసలు వీరి విడాకులకు కారణం ఏమిటన్నది ఇప్పటికీ అధికారికంగా తెలియదు. కానీ అనధికారికంగా మాత్రం రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సంగతలా ఉంచితే ఇద్దరూ ప్రస్తుతానికి తమ తమ సినిమాల్లో బిజీ అయ్యారు.

భేటీలో సమంత కూడా
నాగచైతన్య సంగతి పక్కన పెడితే సమంత మాత్రం ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనకుండా ఒప్పేసుకుని బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ప్రచారం మేరకు నాగార్జున సమంత తండ్రిని కలిశారని ప్రచారం జరుగుతోంది. సమంత -నాగచైతన్య భవిష్యత్ బాగుండడం కోసం ఏదైనా చేయాలని నాగార్జున సమంత తండ్రితో మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో సమంత కూడా పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.

కథనాలు
కానీ ఈ విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అయితే లేదు. అయితే వీరిద్దరూ విడాకులు వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న సమయంలో నాగార్జున కూడా వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం సమంత నాగచైతన్య నుంచి విడిపోయినప్పటికీ మా కూతురు లాగానే అంటూ వెనకేసుకు వచ్చారు. సమంత తల్లిదండ్రులు మీడియా ముఖంగా స్పందించలేదు కానీ ఆమె తీసుకున్న నిర్ణయానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నామని వారు పేర్కొన్నట్లు కొన్ని మీడియాలలో కథనాలు వచ్చాయి.

మద్దతు పలికారని
రెండు కుటుంబాల వారు వారిని కలిపేందుకు ప్రయత్నాలు చేసి విఫలమవడంతోనే వారికి మద్దతు పలికారని ప్రచారం అప్పట్లో జరిగింది. మరి ఇప్పుడు ఈ విధంగా ప్రచారం ఎందుకు మొదలయిందో తెలియదు కానీ ఈ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా సమంత చేసిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క నాగార్జున ది ఘోస్ట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











