ఆ గొడవేనా? నాగ్- బాలయ్య మధ్య ఆరని చిచ్చు!
హైదరాబాద్: నాగార్జున్, బాలయ్య మధ్య గత కొంత కాలంగ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఆ మధ్య అక్కినేని నాగేశ్వరరావు అంతిమయాత్రకు కూడా బాలయ్య అటు వైపుగా కూడా రాలేదంటే ఇద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వారి మధ్య విబేధాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి తాజాగా ‘మేము సైతం' కార్యక్రమం వేదికైంది.
‘మేముసైతం' కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి ఆనందంగా గడిపారు. ఈ వేడుకలో బాలయ్య, నాగార్జున కూడా పాల్గొన్నారు. ఈ ఇద్దరూ ఇతర స్టార్లతో కలివిడిగా మెదిలిరు. అయితే వీరు మాత్రం ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా...కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోలేదు. దీన్ని బట్టి ఇద్దరి మధ్య కొనసాగుతున్న విబేధాల చిచ్చు ఇంకా ఆరలేదని తెలుస్తోంది.

ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాలు ఏమిటనే విషయం గురించి ఆరాతీస్తే...చాలా కాలం నుండి ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని, దీనికి తోడే 2012లో బాలయ్య నటిచిన ‘శ్రీమన్నారాయణ', నాగార్జున నటించిన ‘షిరిడా సాయి' విడుదల సమయంలో నెలకొన్న గొడవ కూడా వీరి మధ్య విబేధాలు మరింత ముదరడానికి కారణమని తెలుస్తోంది.
ఆ మధ్య విజయవంతంగా ప్రదర్శితం అవతున్న 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని తీసేసారని ఆరోపిస్తూ ఆ చిత్ర నిర్మాత పుప్పాల రమేష్ కూకట్ పల్లిలోని అర్జున థియేటర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో దర్శకుడు రవి చావలితో పాటు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి చేరుకుని వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆగస్టు 30న బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం విడుదల కాగా....వారంలోనే ఆ చిత్రాన్ని తీసేసి నాగార్జున నటించిన 'షిరిడి సాయి' చిత్రాన్ని ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications











