వెరైటీ టైటిల్ తో నాగ్
కింగ్ తర్వాత నాగార్జున చేయబోయే చిత్రానికి 23 అనే టైటిల్ పెట్టినట్లు వినపడుతోంది. కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఈ సినిమా కోసం కథా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డైరక్టర్ ఎవరనేది ఇంకా బయిటకు రాలేదు. అలాగే నాగార్జున కూడా స్లమ్ డాగ్ వంటి విభిన్న తరహా చిత్రం చేయాలని పదే పదే చెప్తున్నారు. మరో ప్రక్క షారూఖ్ సూపర్ హిట్ చక్ దే ఇండియా తరహా కథాంశం కూడా గుణ్ణం గంగరాజు రెడీ చేసి వినిపించనున్నట్లు సమాచారం. ఇక నాగార్జున మాత్రం తన కుమారుడు నాగచైతన్య సినిమా పూర్తయ్యేదాకా తనని కదపవద్దని చెప్తున్నాడని అంటున్నారు. ప్రసుతం డిల్లీ లో షూటింగ్ నిమిత్తం నాగ చైతన్య, దిల్ రాజు టీమ్ వెళ్ళింది. వాసు వర్మ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అతను బొమ్మరిల్లు కి ముందు నుంచి దిల్ రాజు స్టోరీ డిపార్టమెంట్లో పూర్తి స్ధాయిలో పనిచేస్తూ అనేక హిట్స్ కి కారణమయ్యారు.


Click it and Unblock the Notifications











