సోదరి బ్యానర్ లో నాగార్జున నెక్ట్స్ చిత్రం

By Srikanya

శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించే చిత్రంలో నటించడానికి నాగార్జున అంగీకరించినట్లు సమాచారం. కథ మొత్తం పూర్తయిన ఈ చిత్రం దిల్‌రాజు సినిమా పూర్తి కాగానే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దర్శకుడు ఎంపిక కావలిసి ఉంది. ఇంతకు ముందు ఈ బ్యానర్‌పై నాగసుశీల తనయుడు సుశాంత్ హీరోగా 'కాళిదాస్", 'కరెంట్" చిత్రాలు నిర్మించారు. ఆ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫ్లాపుని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక మొన్న శుక్రవారం రిలీజైన 'కేడి" చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నాగార్జన 'దిల్"రాజు, ప్రకాశ్‌రాజ్ నిర్మాతలుగా 'ఆకాశమంత"ఫేం రాధామోహన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. తెలుగు, తమిళంలో రూపొందే ఈ చిత్రానికి తమిళంలో 'పయనం" టైటిల్ ఖరారు చేయగా, తెలుగుకి 'వాంటెడ్" టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. హైజాక్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ పిబ్రవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X