బాలకృష్ణ నిర్మాతతో నాగార్జున చిత్రం
బాలకృష్ణతో ప్రస్తుతం అదినాయకుడు చిత్రం నిర్మించి విడుదల కోసం ఎదురు చూస్తున్న నిర్మాత తదుపరి చిత్రానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సునీల్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన పూల రంగడు చిత్రం దర్శకుడు వీరభద్రమ్ ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి భాయ్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇక వీరభద్రమ్ చెప్పిన కామెడీ ఎంటర్టైన్మెంట్ కథకు వెంటనే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.
అలాగే పూలరంగడు,నిప్పు,అహనా పెళ్లంట చిత్రాలకు డైలాగలు రాసిన శ్రీధర్ పీసిన ఈ చిత్రానికి మాటలు రాయనున్నారు. ప్రస్తుతం నాగార్డున తన డమురకం చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రాన్ని శ్రీనివాస రెడ్డి డైరక్ట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై ఆ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సోషియో ఫాంఠసీగా రూపొందుతున్న ఆ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











