Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ తో నాగ్ వద్దనుకున్నాడా?
హైదరాబాద్: నాగార్జున కు అల్లరవటం, అనవసరమైన కామెంట్స్ చేయటం ఎప్పుడూ ఇష్టపడరనే సంగతి తెలిసిందే. సాధ్యమైనంతవరకూ వివాదాలకు దూరంగా ఉండే నాగార్జున రీసెంట్ గా ఓ పెద్ద ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్, నాగార్జున కాంబినేషన్ లో అనుకున్న ప్రాజెక్టుని నాగార్జున కాన్సిల్ చేసారని సమాచారం. దానికి కారణాలు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి...
దర్శకుడు వంశీ పైడిపల్లి తయారు చేసిన స్క్రిప్టుని విన్న నాగార్జున తన పాత్ర పరంగా మార్పులు చెప్పారని తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్ తగ్గించమని, తన వయస్సుకు తగినట్లు హుందాగా ఉండేలా డిజైన్ అడిగినట్లు చెప్తున్నారు. దాంతో వంశీ మళ్లీ తన రచయితలతో కూర్చుని కథలో మార్పులు చేసుకుంటూ వచ్చారని, దాంతో నాగార్జున ఇమేజ్ కు తగినట్లు తయారయినట్లు వినికిడి.
అయితే ఈ కొత్త వెర్షన్ లో చేసిన మార్పులుతో ఎన్టీఆర్ కు ప్రయారిటీ తగినట్లు గా రెడీ అయ్యిందని, విన్న ఎన్టీఆర్ మళ్లీ మార్పులు చెప్పాడని, మొదట చెప్పిన స్క్రిప్టే బాగుందన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే నాగార్జున మొదట వెర్షన్ ఇష్టపడకపోవటంతో ఆ విషయం చెప్పారని, దాంతో హుందాగా నాగార్జున ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చారని సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.