నాగ్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో

By Staff

Nagarjuna
కింగ్ చిత్రం తర్వాత నాగార్జున ఎవరికీ కమిటవ్వలేదు. అయితే వరసగా కథలు వింటున్నారని,కింగ్ నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పైనే చేయనున్నాడని అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్ర దర్శకుడు మాత్ర పరుశరామ్ అమి సమాచారం. యువత చిత్రంతో పరిచయమైన పరుశరామ్ తర్వాత రవితేజ హీరోగా ఆంజనేయులు చిత్రాన్ని ప్రారంభించారు. పూరీ జగన్నాధ్ కి దగ్గర బంధువు అయ్యే పరుశరామ్ తన దగ్గరున్న వరస స్క్రిప్టు లతో అందరినీ కలిసి ఓకే చేయించుకుంటున్నారు. ఆ వరసలోనే నాగార్జునతోనూ ఓకే చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరో ప్రక్క గుణ్ణం గంగరాజు..చెక్ దే ఇండియా సినిమా స్పూర్తితో నాగార్జునకి ఓ కథ వండుతున్నారు.అయితే నాగార్జున మాత్ర తన కుమారుడు హీరోగా నిర్మితమవుతున్న జోష్ చిత్రం రిలీజ్ తర్వాతే తన సినిమా అంటున్నారు. జూలై లో జోష్ చిత్రం విడుదలవుతుందనీ, అనంతరమే నాగార్జున మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటారనీ చెబుతున్నారు. నాగార్జునకు సక్సెస్ సెంటిమెంట్ పరంగా డిసెంబర్ రిలీజ్ ను టార్గెట్ చేసుకుని నాగార్జున-పరశురామ్ కాంబినేషన్ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు శివప్రసాద్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం పరుశరామ్ ..రవితేజ,నయనతార కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనికి హాస్యనటుడు గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదీ సంగతి. ఏదైమైనా పరుశరామ్ త్వరలోనే టాప్ డైరక్టర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X