కొడుకుతో వడ్డీ వ్యాపారం చేస్తున్నఅక్కినేని
తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటి టాప్ హీరో అక్కినేని నాగేశ్వర రావు. ఆ కాలంలో వరుస సినిమాలు తీస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. తద్వారా బాగానే ఆస్తులు సంపాదించారు. కోటీశ్వరుడయ్యాడు. తను సినిమాల్లో ఉండగానే తన పిల్లలందరికీ ఓ మంచి దారి చూపిన అక్కినేని సినిమాలకు నుంచి దూరం అయిన తర్వాత తన ఆస్తులను పిల్లలందరికీ పంచి, తన కోసం కొంత దాచుకున్నాడు. కొడుకు నాగార్జనకు తండ్రి ఆస్తుల్లో మిగతా వారి కంటే వాటా కాస్త ఎక్కువనే దక్కినట్లు ఆ మధ్య గుసగులాడుకున్నారు.
తాజాగా వీళ్ల కుటుంబానికి చెందిన ఆర్థిక వ్యవహారం ఒకటి ఆసక్తి గొలిపే రీతిలో ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య సత్యం సినిమాకు నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన విషయం గుర్తుందా? ఈ సినిమా కొసమని తండ్రి దగ్గర భారీ మొత్తాన్ని అప్పుతీసుకున్నాడట నాగార్జున. ఇందుకు గాను నాగార్జున నెలకు రూ. 3 లక్షలు వడ్డీ రూపేణ కడుతున్నాడట. ఈ కహానీ అంతా...నాగేశ్వర్ రావు తన ఆడిట్ పత్రాలో చూపిన లెక్కలు అని ఫిల్మ్ నగర్ టాక్. వాస్తవానికి నాగార్జునకు తండ్రి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ ను తగ్గించుకోవడానికి తండ్రి కొడుకులు ఈ ప్లాన్ వేశారని గుసగుస.


Click it and Unblock the Notifications











