twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెస్పాన్స్ కి నాగ్ ఫిదా...దెబ్బకు సూపర్ ప్లాన్.. ఇక రంగంలోకి దిగడమే ?

    |

    తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా హీరోగా తెరంగ్రేటం చేసిన నాగార్జున శివ సినిమాతో హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. కెరీర్ మొదటి నుంచి ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ కొత్త కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వెళుతున్న నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విడుదలైన ఆయన వైల్డ్ డాగ్ సినిమా విషయంలో వచ్చిన రెస్పాన్స్ చూసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది.. ఆ వివరాల్లోకి వెళితే

    వైల్డ్ డాగ్ కి మంచి రెస్పాన్స్

    వైల్డ్ డాగ్ కి మంచి రెస్పాన్స్

    నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ అనే దర్శకుడు తెరకెక్కించిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమా ఈ నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది.

    నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ ట్రెండ్

    నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ ట్రెండ్

    అయితే ఈ సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. కానీ ఈ సినిమాకి థియేటర్లో లభించిన ఆదరణ కంటే నెట్ఫ్లిక్స్ లో లభించిన ఆదరణ ఎక్కువగా ఉంది. దాదాపు ఈ సినిమా చాలా రోజుల పాటు నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ ట్రెండ్ అయింది. ఈ రెస్పాన్స్ చూసిన నాగార్జున తాజాగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

    నాగార్జున సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్

    నాగార్జున సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్

    విషయం ఏమిటంటే నాగార్జున సొంతంగా ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి నాగార్జున గత ఏడాదిలోనే ఈ ఓటీటీ లాంచ్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కరోనా ఇంటర్ కావడంతో తాత్కాలికంగా ఆలోచన పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆహా లాంచ్ చేసిన అల్లు అరవింద్ సక్సెస్ సాధించడంతో మళ్లీ నాగార్జున ఓటీటీ మీద దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.

    అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా అండగా

    అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా అండగా

    ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వచ్చింది, మూడు, నాలుగు వేవ్ లు కూడా వస్తాయని కొందరు కేంద్ర మంత్రులు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అంతా డిజిటల్ రంగానిదే అని భావిస్తున్న నాగార్జున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. నాగ్ ఆలోచన చేయడం వెనుక అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండనే యోచన కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు దీని దాని నిర్వహణ అమల చూసుకుంటున్నారు.

    Recommended Video

    Gangavva ఇంటి పనులు.. ఓ పనైపోయింది ! || Filmibeat Telugu
    ఆ సినిమాలకి ప్లాట్ ఫామ్ కోసమే

    ఆ సినిమాలకి ప్లాట్ ఫామ్ కోసమే

    ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్థులలో ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్ రూపుదిద్దుకున్నాయి. వాళ్లకు ప్రాజెక్ట్ ల పేరిట నెలకు చాలా బయటకు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వాటిని కూడా వాడాలని కూడా నాగార్జున ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఇవి కాక అన్నపూర్ణ బ్యానర్ నుంచి కూడా కొన్ని సినిమాలు చేయబోతున్నారట. కరోనా సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ పడింది కానీ లేదంటే ఈపాటికే పలు ప్రాజెక్ట్ ల ప్రకటన వచ్చి ఉండేదని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎప్పటికి కుదురుతుందో ?

    English summary
    Akkineni Nagarjuna’s latest film Wild Dog is performing exceptionally well on Netflix. Elated with the response Wild Dog is getting, Nagarjuna is contemplating the idea of launching his own OTT platform. he wants to launch his own OTT platform and release these films on the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X