Kajal Aggarwal Pregnancy నాగార్జున మూవీ నుంచి అవుట్.. మన్మథుడి సరసన మరో హాట్ హీరోయిన్!
గరుడవేగ లాంటి భారీ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నాగార్జున అక్కినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది ఘోస్ట్. ప్రముఖ నిర్మాతలు నారాయణ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాలు ఏమిటంటే..

ది ఘోస్ట్ మూవీకి కాజల్ షాక్
అక్కినేని నాగార్జున 62వ పుట్టిన రోజున ది ఘోస్ట్ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్ర షూటింగ్ పాజిటివ్ మోడల్‌లో స్టార్ట్ అయింది. అంతా సవ్యంగా సాగుతుందని భావించిన నేపథ్యంలో కాజల్ అగర్వాల్ యూనిట్‌కు భారీ షాక్ ఇచ్చింది.

ప్రెగ్నెన్సీ కారణంగా తప్పుకొన్న కాజల్?
ఫిలింనగర్ ఊహాగానాల ప్రకారం.. కాజల్ అగర్వాల్ ది ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకొంటున్నట్టు సమాచారం. అయితే తాను ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా నుంచి తప్పుకొంటున్నట్టు ఆమె వారికి పరిస్థితిని వివరించింది. దాంతో ది ఘోస్ట్ సినిమా చేయలేనని చెప్పింది. దాంతో మెయిన్ హీరోయిన్ కోసం వెతుకులాట మొదలైంది అనేది ఆ వార్త సారాంశం.

కాజల్ స్థానంలో అమలా పాల్
అయితే కాజల్ అగర్వాల్ హీరోయిన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో చాలా మంది హీరోయిన్లను పరిశీలించారు. చివరకు కాజల్ స్థానంలో అమలా పాల్‌ను తీసుకొన్నారు. ది ఘోస్ట్ సినిమా షూటింగులో వచ్చే నెల మొదటి వారం నుంచి అమలా పాల్ షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది అని యూనిట్ వర్గాలు సమాచారం. దీంతో చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో అమలాపాల్ నటించనున్నారు.

అమలా పాల్‌తోపాటు నాగ్‌కు మరో ఇద్దరు
ఇక ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జునతో అమలాపాల్‌తో మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ కాగా, మరోకరు అనిఖా సురేంద్రన్. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ముఖేష్ జీ, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

అమలా పాల్ కెరీర్ ఇలా..
అమలాపాల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌తో ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలో, రాంచరణ్‌తో నాయక్ సినిమాలో నటించింది. ఇటీవల కుడి ఎడమైతే, పిట్టకథలు వెబ్ సిరీస్‌లో తనదైన శైలిలో తన ప్రతిభను చాటుకొన్నారు. ప్రస్తుతం ఆడు జీవితం, అలదో అంధ పరవాయి పోలా, కడవేర్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











