డిసెంబర్ 17న రగడ చేయడానికి సిద్దంగా ఉన్న మన్మదుడు..!
ప్రముఖ కథానాయకుడు నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం 'రగడ'. అనుష్క, ప్రియమణి నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి వీరు పోట్ల దర్శకుడు. కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'ప్రపంచ వింతల్లో ఒకటైన జోర్డాన్‌లోని పలు అందమైన ప్రదేశాల్లో ఇటీవల రెండుపాటలు చిత్రీకరించాం. ఇంతకు ముందు హాలీవుడ్ చిత్రాలు ఇండియానా జోన్స్, ది లాస్ట్ క్రూసేడర్, హర్ట్‌లాకర్, మిషన్ టు మార్చ్ వంటి చిత్రాల షూటింగ్ జోర్డాన్‌లో జరిగింది. మా చిత్రం పాటలు కూడా అక్కడ చిత్రీకరించడం ఆనందంగా వుంది. అక్టోబరు 13 నుంచి 22 వరకు రాజు సుందరం నృత్య దర్శకత్వంలో పాటలు చిత్రీకరించాం.
ఈ పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జోర్డాన్ యువరాజు ఆలీ, యువరాణి సిటరిమ్ మా చిత్ర యూనిట్‌ను ఆత్మీయంగా ఆహ్వానించి అతిథ్యం అందజేయడం విశేషంగా చెప్పుకోవాలి. నవంబరు 6 నుంచి 17వరకు బ్యాంకా క్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించడంతో ఒక పాట మినహా షూటింగ్ పూర్తవుతుంది. బ్యాలెన్స్ పాటను కూడా వెంటనే పూర్తిచేసి డిసెంబరు 17న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు. డా బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రమణ్యం, తనికెళ్ళ భరణి, రఘుబాబు, ప్రదీప్ రావత్, దేవ్‌గిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











