నచ్చక రీషూట్ పెట్టమన్న నాగార్జున
నాగార్జున తన తాజా చిత్రం రాజన్న విషయంలో ఎగస్ట్రా కేర్ తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం రషెష్ చూసిన నాగార్జున అందులో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని పురమాయించినట్లు తెలుస్తోంది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని నిర్మించటం కూడా ఒకందుకు కారణం అని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ షూట్ చేసిన సీన్స్ లో కొన్ని ఎమోషన్స్ సరిగ్గా పలకలేదని వాటిని రాజమౌళి సహకారంతో పూర్తి చేయమని పురమాయించాడని తెలుస్తోంది.ఇక రాజమౌళి ఈ చిత్రంలో తను చేసే యాక్షన్ సన్నివేశాలకు డైరక్షన్ చేస్తాడనే ఎగ్రిమెంట్ తోనే ఈ ప్రాజెక్టుని విజయేంద్ర ప్రసాద్ చేతిలో పెట్టడం జరిగింది.ఇక ఈ చిత్రంలో నాగార్జున కేవలం క్లైమాక్స్ ముందు ఓ అరగంట మాత్రమే కనపడతారు. కథ మొత్తం ఓ చిన్న పాప చుట్టూ తిరుగుతుంది.
ఆ చిన్న పాపను నాగార్జున వచ్చి రక్షిస్తాడు. అయితే కథ అనుకున్నప్పుడు ఆ పాత్ర మరీ జెచిన్నదిగా ఉందిట. రాజమౌళి వచ్చి...ఆ పాత్ర లెంగ్త్ ఓ ఇరవై నిముషాల వరకూ పెంచారని తెలుస్తోంది.అయితే ఆ విషయం బయిటకు వస్తే సినిమా బిజెనెస్ దెబ్బ తింటుందని దాన్ని దాచి పెడుతున్నారు. నాగార్జుననే ఫోకస్ చేస్తూ బిజెనెస్ చేసే ప్రయత్నాల్లో ఊన్నారు నిర్మాతలు. నాగార్జున సైతం ఈ పాత్ర గురించి బయిట మాట్లాడటం లేదు. ఎంతసేపూ నాగార్జునని, రాజమౌళిని హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే నిర్మిస్తున్నారు. తెలంగాణా చారిత్రిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి షూటింగ్ నిర్వహించారు. స్నేహ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ తొమ్మిదన ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.ఇక ఈ చిత్రం దసరాకి విడుదల కావటం లేదు. అక్టోబర్ మూడవ వారంలో రీషూట్ ఉంది.


Click it and Unblock the Notifications











