ఫ్యాన్స్‌కు శుభవార్త... నాగ్ ‘రాజన్న’ ఇంకా ముందే!
నాగార్జున తాజా సినిమా రాజన్న డిసెంబర్ 23న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 22న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం క్రిమ్‌మస్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికే అని ఫిల్మ్ నగర్ టాక్.
విజయేంద్రవర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక చారిత్రాత్మక యదార్థ ఘటనను బేస్ చేసుకుని రూపొందించారు. ఇందులో నాగార్జున రాజన్న అనే పవర్ ఫుల్ రోల్ పోషించారు. ఈ సినిమాకు గాను రాజమౌళి దర్శకత్వం వహించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయి. కీరవాణి అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్టయింది. ట్రైలర్స్ చూస్తుంటే విజువల్ గా కూడా ఈ సినిమా అద్భుతంగా ఉన్నట్లు టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించడం ఖాయం అనే అంచనాలు వేస్తున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











