నాగార్జున సరసన కాజల్ అగర్వాల్?
పూలరంగడు' సినిమాతో సక్సెస్ కొట్టిన దర్శకుడు వీరభద్రం చౌదరి తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'భాయ్' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తారని తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నాగార్జన పర్సనాలిటీకి కాజల్ సరిగ్గా సరిపోతుంది, పైగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫామ్ లో ఉన్న టాప్ హీరోయిన్. అందుకే ఈ భామను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాజల్ గతంలో నాగ చైతన్య సరసన దడ చిత్రంలో నటించింది. ఇప్పడు నాగచైతన్య తండ్రి నాగార్జునతో కూడా ఆమె రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'షిరిడి సాయి' చిత్రంలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు భక్తుడిగా అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన నాగ్, షిరిడి సాయి చిత్రంలో తొలిసారి దేవుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. బిజినెస్ మేన్ భారీ విజయంతో జోరు మీదన ఉన్న కాజల్ ప్రస్తుతం తమిళంలో మాట్రాన్, తుపాకి అనే చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న 'బాద్ షా' చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











