రాజమౌళిని అందుకే దువ్వుతున్నాడు
నాగార్జున ప్రతీ విషయంలో చాలా స్టాటజీగా వెళుతూంటారని అందరూ చెప్తూంటారు. ప్రస్తుతం తన కుమారుడు కెరిర్ ని పట్టాలు ఎక్కించే విషయంలోనూ నాగార్జున అలాగే వ్యవహిస్తున్నారు. తాజాగా ఆయన రాజమౌళిని ఎలాగైనా తన కుమారుడుతో సినిమా చేసే దిశలో ఒప్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసమే రాజన్న సినిమా ఒప్పుకున్నాడని, రాజమౌళిని ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు తీసేలా కండిషన్ పెట్టారని చెప్తున్నారు. యాక్షన్ చిత్రీకరణకు వచ్చిన రాజమౌళితో నాగార్జున తన కుమారుడు విషయం ప్రస్దావించి బ్లాంక్ చెక్ ఆఫర్ తరహాలో మాట్లాడాడని చెప్పుకుంటున్నారు.
ఈ విషయమై ఆలోచించి చెబుతానని, ప్రస్తుతం తాను కేవలం ఈగ, ప్రభాస్ చిత్రాల మీదే ఉన్నానని రాజమౌళి స్పష్టం చేసారని తెలుస్తోంది. ఇక రాజన్న చిత్రం విషయానికి వస్తే..ఆ చిత్రం తెలంగాణా రజాకార్ల ఉద్యమం నేపధ్యంలో తెరకెక్కుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో బిట్ సాంగ్స్ తో సహితంగా పద్నాలుగు పాటలు ఉన్నాయి. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరో ప్రక్క నాగచైతన్య తన తాజా చిత్రం దడ పూర్తి చేసుకుని బెజవాడ రౌడీలు చిత్రంలో బిజీగా ఉన్నారు. బెజవాడ రౌడీలు చిత్రం రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications