అనుష్క కోసం నాగార్జున గెస్ట్ గా మారారు
హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సైజ్ జీరో' చిత్రంలో గెస్ట్ రోల్ లో నాగార్జున కనిపించనున్నారని సమాచారం. సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ కు ఎవరు ఉంటే బాగుంటారు అనుకున్నప్పుడు అనుష్క..నాగ్ ని సజెస్ట్ చేసిందని, ఆమే నాగార్జునతో మాట్లాడి ఒప్పించిందని సమాచారం. నాగార్జున ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. సినిమాలో ఇది చిన్న రోల్ అయినా కథను మలుపు తిప్పే కీలకమైందని వినికిడి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అనుష్క ఎందుకు చేస్తోంది
వరుసగా భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న అందాల అనుష్క ఛేంజ్ కోసం రూట్ మార్చి ఆఫ్ బీట్ చిత్రాలపై దృష్టి కేంద్రీకరించింది..... ఆ కోవలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 'సైజ్ జీరో' అనే చిత్రంలో నటిస్తోంది.... ఈ సినిమాలో తన ఫిజిక్ తో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైన అనుష్క మరోసారి ఉదారస్వభావాన్నీ చాటుకుంటోంది.
పరోక్షంగానే అయినా తన సినిమా వల్ల నష్టపోయిన నిర్మాణ సంస్థను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది జేజమ్మ....దర్శకుడు సెల్వరాఘవన్ పై నమ్మకంతో 'వర్ణ' సినిమాపై భారీ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయిన పీవీపీ నిర్మాణ సంస్థే.... 'సైజ్ జీరో' చిత్రానికీ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.
అయితే.... 'వర్ణ' నష్టాన్ని ఈ చిత్రంతో పూడ్చాలని భావించిన అనుష్క అతి తక్కువ పారితోషకానికే 'సైజ్ జీరో' చిత్రంలో నటించాలని నిర్ణయించుకుందట.... 'వర్ణ' సినిమాలో స్వీటీకి జోడీగా నటించిన తమిళ హీరో ఆర్య తాజా చిత్రంలోనూ అమ్మడితో రొమాన్స్ చేస్తున్నాడు..... అనుష్క ప్రభావం అబ్బాయి మీద పడిందో ఏమో ఆర్య సైతం తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట.
సినిమా చిత్రీకరణ కుడా తక్కువ సమయంలో పూర్తైపోయే సూచనలు కనిపిస్తుండటంతో పీవీపీ సంస్థకు అన్ని విధాలా 'సైజ్ జీరో' చిత్రం లాభదాయకంగానే ఉంటుందని ట్రేడ్ పండిట్స్ భావిస్తున్నారు..... ఏమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉదారతను ప్రదర్శించిన అనుష్క, ఆర్య సమకాలీన తారలకు ఆదర్శంగా నిలిచారనే చెప్పుకోవాలి.

మరో ప్రక్క
శ్రుతి డేట్స్ కారణంగా పీవీపీ సంస్థతో జరుగుతోన్న గొడవ నేపథ్యంలో ఆమె ఇందులో నటించే అవకాశం లేదు... తరువాత అందాల బాలీవుడ్ తార ఇషా గుప్త పేరు వినిపించింది... ఇప్పుడు ఆమె కూడా నటించడం లేదని తెలుస్తోంది... బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీతో హాట్ హాట్ గా నటించి మురిపించిన ఇషా గుప్త తెలుగులో నటించాలని ఎన్నాళ్ళ నుంచో ఆశగా చూస్తోంది... 'మగధీర' సినిమా చూశాక తెలుగు సినిమాలపై మరింతగా మనసు పారేసుకున్న ఇషా గుప్తకు 'సైజ్ జీరో'లో నటించే ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసింది.
అయితే ప్రస్తుతం అమ్మడి స్థానంలో సోనాల్ చౌహాన్ ను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది... టాలీవుడ్ అనగానే ఉత్తరాది భామలు రేటు పెంచేస్తుంటారు... ఇషా కూడా అలాగే ప్రవర్తించడం వల్లే ఆమెకు 'సైజ్ జీరో'లో నటించే అవకాశం తప్పిపోయిందని వినికిడి... సోనాల్ చౌహాన్ ఇప్పటికే బాలకృష్ణ సరసన 'లెజెండ్'లో నటించి లక్కీ హ్యాండ్ గా పేరొందింది...అందువల్ల ఆర్య సరసన కూడా సోనాల్ నటించి అలరిస్తుందని దర్శకనిర్మాతలు భావించారు... త్వరలోనే 'సైజ్ జీరో' సెట్స్ పైకి వెళ్లనుంది.
‘సైజ్ జీరో' సినిమా వివరాల్లోకి వెళితే..
పి.వి.పి. పతాకంపై ప్రొడక్షన్ నెం.10గా ‘సైజ్ జీరో' సినిమా షూటింగ్ ఆ మధ్యన మొదలైంది. తెలుగు, తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క, ఆర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
భరత్, ఊర్వశి కీలక పాత్రధారులు. యం.యం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: నిరవ్‌షా, ఆర్ట్: ఆనంద్‌సాయి, కథ-స్ర్కీన్‌ప్లే: కణిక ధిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్.వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాశ్ కోవెలమూడి.


Click it and Unblock the Notifications











