'మనం' పై ప్రచారం...నిజమేనా

By Srikanya

హైదరాబాద్ : సౌత్ ఇండియాలో ఏ చిత్రమైనా హిట్ అయితే వెంటనే బాలీవుడ్ బ్యాచ్ దిగిపోతుంది. ఇప్పుడు 'మనం' కి పాజిటివ్ టాక్ రాగానే బాలీవుడ్ వారు వాలిపోయారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై 'మనం' ప్రమోషన్ ఇంటర్వూలు ఇస్తున్న నాగచైతన్య కానీ, నాగార్జున కానీ ప్రస్తావించలేదు. ఈ చిత్రంలో గెస్ట్ గా చేసిన అమితాబ్ ఈ రీమేక్ రైట్స్ పై ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు.

అలాగే నాగార్జున పాత్రలో అమీర్ ఖాన్, నాగచైతన్య పాత్రలో రణబీర్ కపూర్ చేస్తారని, అమితాబ్...నాగేశ్వరరావు చేసిన పాత్ర చేస్తారని చెప్తున్నారు. అలాగే...ఈ రీమేక్ లో శ్రేయ పాత్రను ప్రీతిజింతా, సమంత పాత్రను కత్రినా కైఫ్ చేస్తారని చెప్తున్నారు. అయితే అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ లేకుండా ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ఫిల్మ్ చేయటమేంటని అంటున్నారు.

Nagarjuna's MANAM hindi remake

ఎందుకంటే 'మనం' సినిమాలో వర్కవుట్ అయిన అంశం.. రివర్స్ లో తాత పాత్ర మనవడు, మనవడు పాత్ర తాత చేయటమే. అలాగే పేర్లు సైతం అలాగే ఒరిజనల్ పేర్లను తీసుకుని రివర్స్ లో పెట్టి, ఫన్ క్రియేట్ చేసారు. ఒకే కుటుంబం లో వారు కాకుండా వేరే వారు చేస్తే ఆ రిసెంబలన్స్ రాదుకదా..ఆ ఫన్ ఉండదు కదా అనేది ఆలోచించాల్సిన అంశమే. బాలీవుడ్ లో పాతుకుపోయిన కుటుంబం వారు ఈ ప్రాజెక్టుని రీమేక్ చేస్తే బాగుంటుదని సినిమా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం. అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X